Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్వయం కృషితో ఎదిగి, మెగాస్టార్ స్థాయికి చేరుకున్న చిరంజీవి సినీ ప్రయాణానికి నేటితో 47 ఏళ్లు పూర్తయ్యాయి. 70 ఏళ్ల వయసులోనూ యువ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తోన్న ఆయనను కోట్లాది మంది ఆదర్శంగా తీసుకుంటారు.
Chiranjeevi: చిరంజీవి నటించిన తొలి చిత్రం పునాది రాళ్లు అయినప్పటికీ, ఆయన నటించిన రెండో సినిమా ప్రాణం ఖరీదు (దర్శకుడు కె. వాసు) ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటి చిత్రం. 1978 సెప్టెంబర్ 22న విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి నరసింహ పాత్రలో నటించి గుర్తింపు పొందారు. రావుగోపాలరావు, జయసుధ, చంద్రమోహన్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
ఇది కూడా చదవండి: Ahmedabad: బాలుడి కడుపులో నొప్పిగా ఉందని హాస్పిటల్ కి వెళ్లగా కంగుతిన్న కుటుంబ సభ్యులు!
ఈ సందర్భంగా చిరంజీవి సోషల్ మీడియాలో భావోద్వేగపూర్వకంగా ఒక పోస్ట్ షేర్ చేశారు. ఆయన రాసిన ప్రకారం — “22 సెప్టెంబర్ 1978.. ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనబడే నేను, ‘ప్రాణం ఖరీదు’ సినిమా ద్వారా ‘చిరంజీవిగా’ మీ ముందుకొచ్చి నేటితో 47 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ ప్రయాణంలో నాకు నటుడిగా ప్రాణం పోసి, మీ అన్నయ్యగా, మీ కుటుంబ సభ్యుడిగా, ఒక మెగాస్టార్గా ఎప్పటికప్పుడు ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిని. ఈ 47 ఏళ్లలో నాకందిన అవార్డులు, గౌరవాలు అన్నీ నా వి కావు — మీవే, మీరు అందించినవే” అని పేర్కొన్నారు.
ప్రస్తుతం చిరంజీవి షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మెగాస్టార్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
22 సెప్టెంబర్ 1978
‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా ‘చిరంజీవిగా’ మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం… pic.twitter.com/1VSVTu9Kkz— Chiranjeevi Konidela (@KChiruTweets) September 22, 2025
ఇకపోతే, ప్రస్తుతం చిరంజీవి నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నారు. అనిల్ రావిపుడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే చిత్రం రాబోతోంది. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. అదేవిధంగా విశ్వంభర (దర్శకుడు వశిష్ట), అలాగే శ్రీకాంత్ ఓదెల, బాబీ దర్శకత్వంలో మరిన్ని సినిమాలు చేస్తున్నారు.
చిరంజీవి సినీ ప్రయాణం 47 ఏళ్లు పూర్తవడంతో అభిమానులందరూ మరోసారి మెగాస్టార్ను కితాబిస్తున్నారు.
