Mahesh Babu Sridivya: మహేష్ బాబును అన్న అన్న అని పిలిచేదాన్ని.. చాక్లెట్స్ కూడా ఇచ్చేవాడు – శ్రీదివ్య

Mahesh Babu Sridivya: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ “SSMB 29” కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా మీద అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ విజయాల తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ చిత్రం గ్లోబల్ లెవల్‌లో రిలీజ్ కాబోతుందనే వార్తలు వస్తున్నాయి.

Mahesh Babu Sridivya: ఈ సినిమా గురించి ఎప్పుడూ హాట్ టాపిక్ నడుస్తున్నప్పటికీ, తాజాగా మహేష్ బాబుతో సంబంధించిన ఓ మధుర జ్ఞాపకం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

యంగ్ హీరోయిన్ శ్రీదివ్య చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘యువరాజు’ సినిమాలో ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ పాత్రలో కనిపించింది. తాజాగా ఓ ఈవెంట్‌లో ఆమె ఆ రోజుల జ్ఞాపకాలు షేర్ చేస్తూ,  “అప్పుడు నేను మహేష్ బాబును అన్న అన్న అని పిలిచేదాన్ని. నాకు ఆయన చాక్లెట్స్ ఇస్తూ చాలా అక్కరగా చూసుకునేవారు” అని చెప్పారు.

 

View this post on Instagram

 

A post shared by jk_Cinema_news (@jk_cinema_news_2.0)

మహేష్ బాబు చిన్నప్పట్లో శ్రీదివ్యను ఎత్తుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానికి సంబంధించిన వీడియోలో శ్రీదివ్య చేసిన కామెంట్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న SSMB 29 ఒక యాక్షన్-అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతుంది. దాదాపు రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆఫ్రికన్ జంగిల్ బ్యాక్‌డ్రాప్‌లో నడుస్తుందని టాక్. ఇందులో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

120కి పైగా దేశాల్లో విడుదల కానున్న ఈ సినిమా, మహేష్ కెరీర్‌లోనే కాకుండా ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sri Divya (@sd_sridivya)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *