Raghava Lawrence: సినిమా తెరపై హీరో పాత్రలతో అభిమానులను అలరించే రాఘవ లారెన్స్, నిజ జీవితంలోనూ తన సేవా కార్యక్రమాలతో హీరోగానే నిలుస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో నటుడిగా, దర్శకుడిగా, కొరియోగ్రాఫర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లారెన్స్, అనేక మందికి అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారు.
Raghava Lawrence: ఇటీవల ఆయన చేసిన సాయం నెట్టింట ప్రశంసల వర్షం కురిపిస్తోంది. శ్వేత అనే దివ్యాంగురాలు నడవలేని స్థితిలో జీవిస్తోంది. పేదరికంతో పాటు అనారోగ్యం కారణంగా ఆమె మంచానికే పరిమితమైంది. ఈ విషయం తెలుసుకున్న రాఘవ లారెన్స్ ముందుకు వచ్చి ఆమెకు అండగా నిలిచారు.
కొద్ది రోజుల క్రితం శ్వేతకు ఓ స్కూటీని బహుమతిగా ఇచ్చిన లారెన్స్, ఆమెకు కృత్రిమ కాలును అమర్చించి నడవడానికి సాయం చేశారు. అంతేకాదు, గుడిసెలో జీవిస్తున్న ఆమెకు సొంతిల్లు కట్టించాలని కూడా నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని లారెన్స్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించగా, ఆయన ఉదారతపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇది లారెన్స్ చేసిన తొలి సాయం కాదు. ఆయన స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనాథలు, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేస్తూ, వారికి స్కాలర్షిప్లు అందజేస్తున్నారు. రైతులకు ట్రాక్టర్లను కొనిచ్చి అండగా నిలుస్తున్నారు. సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును సామాజిక సేవలకు వినియోగించడం ఆయన ప్రత్యేకత.
రియల్ లైఫ్లో కూడా ఇలాంటివారే అసలు హీరోలని అభిమానులు చెబుతున్నారు. రాఘవ లారెన్స్ మళ్లీ ఒకసారి “మనసు బంగారం” అని నిరూపించుకున్నారు.
Hi everyone, this is Swetha. Earlier, I was able to support her with leg support for walking. Later, I gifted her a scooty so she could move around independently. Now, I feel building a house for her will truly change her life. She is a girl with a golden heart, and my own heart… pic.twitter.com/vp0KUS1jsZ
— Raghava Lawrence (@offl_Lawrence) September 7, 2025
