Ganesh Immersion: గంగమ్మ ఒడికి గణపయ్యని చేర్చే సమయంలో ఈ తప్పులు చేస్తే కష్టాలకే వెల్కం!

Ganesh Immersion: వినాయక చవితి నుంచి గణపతి ఉత్సవాలు ఆరంభమై అనంత చతుర్దశి రోజున నిమజ్జనంతో ముగుస్తాయి. ఈ పది రోజులపాటు గణపతి బప్పా భూలోకంలో సంచరిస్తూ భక్తులను ఆశీర్వదిస్తాడని విశ్వాసం. ఉత్సవాల్లో చివరి రోజు గణపతికి వీడ్కోలు పలకడం ఒక ప్రత్యేకమైన ఆచారం. అయితే గణపతి నిమజ్జనం చేసే సమయంలో చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద కష్టాలకు దారితీస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి.

నిమజ్జనం సమయంలో చేయకూడని తప్పులు:

  • నీటిని కలుషితం చేయవద్దు: విగ్రహాలను నేరుగా నదులు, చెరువుల్లో నిమజ్జనం చేయడం మానుకోండి. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రత్యేక ట్యాంకుల్లో లేదా ఇంట్లోనే నిమజ్జనం చేయాలి.

  • విరిగిన విగ్రహం నిమజ్జనం చేయొద్దు: విగ్రహం పగలకుండా జాగ్రత్త వహించాలి. విరిగిన విగ్రహాన్ని నిమజ్జనం చేయడం అశుభంగా పరిగణించబడుతుంది.

  • అసంపూర్ణ ఆచారాలు వద్దు: నిమజ్జనానికి ముందు గణేశునికి పూజ, హారతి, నైవేద్యం చేసి, ప్రసాదాన్ని పంచి పెట్టాలి.

  • విగ్రహాన్ని నేరుగా నీటిలో వేయొద్దు: ముందుగా మూడు సార్లు నీటిలో ముంచి, తరువాత నెమ్మదిగా విడిచిపెట్టాలి.

  • మత్తు పదార్థాలు వద్దు: నిమజ్జనం రోజున మత్తు పదార్థాలను పూర్తిగా నివారించాలి. సాత్వికంగా, స్వచ్ఛమైన మనస్సుతో గణపతికి వీడ్కోలు పలకాలి.

  • పూజా సామాగ్రి నీటిలో వేయొద్దు: పువ్వులు, దండలు, బట్టలు, కొబ్బరికాయ వంటి వాటిని నీటిలో వేయకుండా శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలి.

  • వెనక్కి తిరిగి చూడవద్దు: నిమజ్జనం అనంతరం వెనక్కి తిరిగి చూడరాదని నమ్మకం. వచ్చే ఏడాది మళ్లీ రమ్మని గణపతికి ఆహ్వానం పలకాలి.

అనంత చతుర్దశి రోజు కేవలం విగ్రహానికి వీడ్కోలు చెప్పడమే కాదు, భక్తుల కష్టాలు, బాధలను గణేశుడు తొలగిస్తాడనే విశ్వాసాన్ని సూచిస్తుంది. అందుకే నిమజ్జనం సంపూర్ణ భక్తి, శ్రద్ధలతో, ఆచార నియమాలతో చేయాలని పండితులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *