Ganesh Chaturthi: వినాయక చవితి అనగానే మన కళ్లముందు మొదటిగా మెరిసేవి గణనాధుని విగ్రహాలు, అంబరాన్నంటే సంబరాలు. కానీ ఈ పండుగలో అత్యంత ముఖ్యమైనది గణపయ్యకు సమర్పించే నైవేద్యం. భోజనప్రియుడైన లంబోదరుడు తనకు ఇష్టమైన ప్రసాదాలు అందిస్తే, భక్తుల కోరికలు నెరవేర్చుతాడని విశ్వాసం ఉంది. మరి గణపతికి ఇష్టమైన ప్రసాదాలేంటో చూద్దాం.
Ganesh Chaturthi: ఉండ్రాళ్లు పాల ఉండ్రాళ్లు గణనాధునికి అత్యంత ప్రీతికరమైనవి. బియ్యపు పిండి, పాలు, చక్కెర, యాలకుల పొడి, సబ్బుదానాతో ఈ ప్రత్యేక నైవేద్యం సిద్ధం చేస్తారు. ముందుగా పిండితో ఉండలు కట్టి ఆవిరి మీద ఉడికించి, పాలలో సబ్బుదానా, చక్కెర, యాలకులు వేసి కలిపి వీటిని ఉంచుతారు.
పులిహోర
చింతపండు పులిహోర గణపయ్యకు ఇష్టమైన నైవేద్యాల్లో ఒకటి. చింతపండు రసం, పసుపు, పల్లీలు, ఆవాలు, శెనగపప్పు, ఎండు మిరపకాయలతో వండిన ఈ పులిహోర పండుగల్లో తప్పనిసరి.
మోదక్
మోదక్ గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదం. బియ్యపు పిండి పిండితో చిన్న గుళికలుగా చేసి, బెల్లం-కొబ్బరి పూర్ణం పెట్టి ఆవిరి మీద ఉడికిస్తారు. ఈ మోదక్ను సమర్పిస్తే గణనాధుడు అత్యంత సంతోషిస్తాడు.
రవ్వ లడ్డు
బొంబాయి రవ్వ, చక్కెర, ఎండు కొబ్బరి, జీడిపప్పు, కిస్మిస్తో తయారు చేసే రవ్వలడ్డు వినాయకుడి నైవేద్యంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది.
స్వీట్ పొంగల్
బియ్యం, పెసరపప్పు, బెల్లంతో తయారుచేసే స్వీట్ పొంగల్ కూడా గణపయ్యకు ఇష్టమైనది. ఇందులో నెయ్యిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు రుచి మరింత పెంచుతాయి.
అప్పాలు
రవ్వ, చక్కెర, యాలకుల పొడి కలిపి చిన్న అప్పాల్లా చేసి నూనెలో వేయిస్తారు. ఇవి వినాయక చవితిలో నైవేద్యంగా ప్రత్యేకంగా సమర్పిస్తారు.
ఇలా గణనాధుడికి ఇష్టమైన ఈ ప్రసాదాలు సమర్పిస్తే ఆయన కృప వర్షించి, మన కోరికలు నెరవేరతాయని పురాణాలు చెబుతున్నాయి.
మరింకెందుకు ఆలస్యం.. ఈ వినాయక చవితికి ప్రసాదాలన్నీ గణేశునికి సమర్పించడానికి రెడీ అయిపోండి.
