Supreme Court: ఆధునిక కాలంలో భార్యాభర్తల మధ్య బంధం ఎంత సున్నితమైనదో ఇటీవలి వివాదాలు చెప్పకనే చెబుతున్నాయి. ఏడడుగులు వేసిన ప్రేమ బంధం, కొన్ని నెలల్లోనే కోర్టు మెట్లు ఎక్కే పరిస్థితులకు దారి తీస్తోంది. అలాంటి సంఘటనే ఇటీవల సుప్రీంకోర్టు ఎదుట చోటు చేసుకుంది. కేవలం 18 నెలల పాటు మాత్రమే కలిసి జీవించిన ఓ మహిళ.. విడాకులు తీసుకుంటూ రూ.12 కోట్ల భరణం, ఖరీదైన BMW కారు, ముంబైలో విలాసవంతమైన అపార్ట్మెంట్ను తన భర్త నుండి కోరింది.
Supreme Court: ఈ కేసు హైప్రొఫైల్గా మారింది. భర్త ఐటీ రంగానికి చెందినవాడే అయినా, భార్య కూడా MBA పూర్తి చేసి ఐటీ రంగంలో మంచి అనుభవం కలిగినవాళ్లలో ఒకరు. అయినప్పటికీ తన జీవనోపాధికి భర్తపై ఆధారపడాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని బెంచ్ ఆమె విద్యార్హతలపై ప్రశ్నలు వేసింది.
ఇది కూడా చదవండి: PM Modi: తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటనకు సర్వం సిద్ధం.. భారీ ప్రాజెక్టులకు శ్రీకారం
Supreme Court: “మీరు చదువుకున్నవారు, మంచి ఉద్యోగ అనుభవం ఉన్నవారు. అలాంటప్పుడు ఎందుకు భర్తపై ఆధారపడాలి? స్వయంగా జీవించండి..” అంటూ కోర్టు కౌంటర్ వేసింది. “విలాసవంతమైన జీవితం కొనసాగించాలన్నదే మీ డిమాండ్ అయితే, మీరు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండండి. భర్త వద్ద భారీ భరణం ఆశించడం న్యాయసమ్మతం కాదు” అని పేర్కొంది.
Supreme Court: తన భర్త ధనవంతుడు అని చెప్పిన మహిళ.. తన మానసిక సమస్యలు (Schizophrenia వంటి) ఉన్న భర్తతో బ్రతకలేక విడాకులు కోరుతున్నానని వివరించింది. ఆమె తనపై క్రిమినల్ కేసులు పెట్టిన నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గిపోయాయంటూ వాదించింది. దీనికి సమాధానంగా ప్రధాన న్యాయమూర్తి “మేము ఆ కేసులను కూడా రద్దు చేస్తాం. కానీ మీరు మీ జీవితం మీద నమ్మకం పెట్టుకోండి. భర్తపై ఆధారపడకండి” అని సూటిగా తెలిపారు.
కోర్టు చివరకు ఆమెకు రెండు ఆప్షన్లు ఇచ్చింది –
- ముంబైలో అపార్ట్మెంట్ను భరణంగా తీసుకోవడం
- లేదా ఒకేసారి రూ.4 కోట్ల పరిహారం తీసుకుని జీవితం ముందుకు సాగించడమ
ఈ తీర్పుతో మహిళకు షాక్ తగిలింది. కానీ దేశవ్యాప్తంగా ఇదే తీర్పు ఒక గొప్ప సందేశంగా మారింది. విడాకుల అనంతరం కూడా స్వతంత్రంగా జీవించగలిగే సత్తా ఉన్న మహిళలు, పెద్ద మొత్తంలో భరణం కోరడం సమాజానికి సరైన సందేశం ఇవ్వదని కోర్టు తేల్చిచెప్పింది.
