Special Trains: దసరా, దీపావళి పండగలు సమీపిస్తున్న వేళ రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. పండగ సీజన్లో పెరిగే రద్దీని దృష్టిలో ఉంచుకుని, ఇప్పటికే నడుస్తున్న వారాంతపు ప్రత్యేక రైళ్ల సేవలను మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆగస్టుతో ముగియనున్న గడువును నవంబరు 24 వరకు కొనసాగిస్తామని అధికారులు ప్రకటించారు.
ఈ నిర్ణయం వల్ల పండగలకు సొంత ఊళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ప్రత్యేక రైళ్ల వివరాలు:
- తిరుపతి – సాయినగర్ షిర్డీ (07637/07638) రైలు సేవలు నవంబరు 24 వరకు కొనసాగుతాయి.
- నరసాపురం – తిరువణ్ణామలై (07219/07220) ప్రత్యేక రైళ్లు నవంబరు 24 వరకు నడుస్తాయి.
- హైదరాబాదు – కన్యాకుమారి (07230/07229) ప్రత్యేక రైలు సేవలు పొడగింపు.
- కాచిగూడ – మధురై (07191/07192) ప్రత్యేక రైలు సేవలు పొడగింపు.
- హైదరాబాదు – కొల్లాం (07193/07194) రైలు తిరుపతి, రేణిగుంట మీదుగా నవంబరు చివరి వరకు రాకపోకలు సాగిస్తుంది.
దీనితో పండగ సీజన్లో ప్రయాణించే వారికీ సౌకర్యవంతమైన ప్రయాణం లభించనుంది.
