Telangana Panchayat Elactions: మోగిన పంచాయతీ ఎన్నికల నగారా . . షెడ్యూల్ ఇదే . .

Telangana Panchayat Elactions: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్‌ను విడుదల చేస్తూ, ఎన్నికల కోడ్‌ ఈ క్షణం నుంచే అమలులోకి వస్తుందని ఎన్నికల ప్రధాన అధికారి రాణి కుముదిని ప్రకటించారు. మొత్తం 31 జిల్లాల్లో 565 మండలాల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. గ్రామీణ ప్రజాప్రతినిధుల ఎంపిక కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

షెడ్యూల్ వివరాలు

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో జరుగనున్నాయి.

  • అక్టోబర్‌ 23, 27: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్

  • నవంబర్‌ 11: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు
    గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు.

  • అక్టోబర్‌ 31, నవంబర్‌ 4, నవంబర్‌ 8: మూడు విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు

  • పోలింగ్‌ జరిగిన రోజునే పంచాయతీ ఫలితాలు ప్రకటిస్తారు.

ఎన్నికలు (Telangana Panchayat Elactions)జరిగే స్థానాలు

  • 5,749 ఎంపీటీసీలు

  • 565 జెడ్పీటీసీలు

  • 12,733 పంచాయతీలు

  • 1,12,288 వార్డులు
    వీటికి రూపొందించిన 31,371 పోలింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉన్నాయి

Also Read: Tilak Varma: తెలుగోడి లాస్ట్ పంచ్ ఇలా ఉంటుంది.. పాక్ కు చుక్కలు చూపించిన తిలక్ వర్మ

ఓటర్ల వివరాలు . .

రాష్ట్ర గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 1,87,03,168 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో హక్కు వినియోగించనున్నారు:

  • మహిళలు: 85,36,770

  • పురుషులు: 81,65,894

  • ఇతరులు: 504

ఎన్నికల నియమావళి

ఎన్నికల నిబంధనలు వెంటనే అమలు జరుగనున్నందున, అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రజాప్రతినిధుల అభ্যర్థిత్వాలు, ప్రచార కార్యక్రమాలపై కఠినమైన నియంత్రణలు కొనసాగుతాయి. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా సాగేందుకు అధికార యంత్రాంగం కీలక చర్యలు తీసుకోనుందని ఎన్నికల సంఘం పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *