Asia Cup Trophy Controversy: 2025 ఆసియా కప్‌ను భారత్ గెలుచుకున్నప్పటికీ, విజేతలకు దక్కాల్సిన ట్రోఫీని జట్టు స్వీకరించలేదు. దీనికి కారణం – పాకిస్థాన్ హోం మంత్రి & ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడు మొహసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి టీమిండియా నిరాకరించడం. భారత్ అభ్యర్థనను పట్టించుకోకుండా నఖ్వీ స్వయంగా ట్రోఫీ ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో, జట్టు అందుకోవడాన్ని తిరస్కరించింది.
Asia Cup Trophy Controversy: వివాదాస్పద పరిణామంలో, నఖ్వీ కేవలం ట్రోఫీనే కాదు, ఆటగాళ్ల మెడల్స్‌ను కూడా తనతో పాటు తీసుకెళ్లిపోయారు. ఈ సంఘటనపై బీసీసీఐ ఇప్పటికే తీవ్రంగా స్పందించింది. ACC కూడా భారత్ ట్రోఫీ స్వీకరణకు నిరాకరించిందని అధికారికంగా వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Tilak Varma: తెలుగోడి లాస్ట్ పంచ్ ఇలా ఉంటుంది.. పాక్ కు చుక్కలు చూపించిన తిలక్ వర్మ
ట్రోఫీ వివాదంపై, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియాలో తనదైన శైలిలో స్పందించారు. తిలక్ వర్మతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, ఎమోజీలతో ట్రోఫీ ఆకారాన్ని క్రియేట్ చేశారు. దానికి క్యాప్షన్‌గా –
“మ్యాచ్ ముగిసిన తర్వాత విజేత జట్టును మాత్రమే గుర్తుంచుకుంటారు. ట్రోఫీ చిత్రాన్ని కాదు” అని రాశారు.
ఈ వ్యాఖ్యలు నఖ్వీ చర్యలపై పరోక్ష విమర్శగా నిలిచాయి.
“నాకు నిజమైన ట్రోఫీ నా జట్టే” – సూర్యకుమార్: ఫైనల్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ సూర్యకుమార్ – “విజేత జట్టుకు ట్రోఫీ ఇవ్వకుండా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు. కానీ నాకు నిజమైన ట్రోఫీ నా ఆటగాళ్లే, సహాయక సిబ్బందే” అని భావోద్వేగంగా అన్నారు.
అలాగే, నఖ్వీ నుండి ట్రోఫీని స్వీకరించకూడదనే నిర్ణయం జట్టు అంతర్గతంగానే తీసుకుందని, బీసీసీఐ లేదా మరెవరూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు.
View this post on Instagram
ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్, పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రూప్ దశలో 7 వికెట్లతో, సూపర్ 4లో 6 వికెట్లతో ఇప్పటికే పాకిస్థాన్‌ను మట్టికరిపించిన భారత్, ఫైనల్‌తో మూడోసారి వరుస విజయాన్ని నమోదు చేసింది.
