OTT Movies: దసరా పండగ సందర్భంగా థియేటర్లలో కొత్తగా రెండు భారీ ప్రాజెక్టులు విడుదల కాబోతున్నాయి. అయితే ఇవి రెండు కూడా డబ్బింగ్ సినిమాలే. రిషభ్ శెట్టి ‘కాంతార 1’, ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ సినిమాలు కంటెంట్ బలంపై ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
OTT Movies: ఇకపోతే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమా థియేటర్లలో దూసుకుపోతుండడంతో తెలుగు స్ట్రెయిట్ సినిమాలు దసరా రేసులో లేవు. కానీ ఓటీటీ ప్లాట్ఫారమ్లలో మాత్రం వరుసగా ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్కి సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా, థియేటర్లలో మంచి హిట్ అయిన ‘లిటిల్ హార్ట్స్’ ఇప్పుడు ఓటీటీలో ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి. అలాగే ‘జూనియర్స్’, ‘మదరాసి’ సినిమాలు, శ్రద్ధా శ్రీనాథ్ నటించిన ‘ద గేమ్’ వెబ్ సిరీస్ కూడా భిన్నమైన కంటెంట్తో ఆకట్టుకోబోతున్నాయి.
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ లిస్ట్
ఆహా
- జూనియర్ (తెలుగు సినిమా) – సెప్టెంబరు 30
ఈటీవీ విన్
- లిటిల్ హార్ట్స్ (తెలుగు సినిమా) – అక్టోబరు 01
నెట్ఫ్లిక్స్
- మిస్సింగ్ కింగ్ (జపనీస్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 29
- నైట్ మేర్స్ ఆఫ్ నేచర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – సెప్టెంబరు 30
- ద గేమ్ (తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
- మాన్స్టర్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 03
అమెజాన్ ప్రైమ్ వీడియో
- మదరాసి (తెలుగు డబ్బింగ్ సినిమా) – అక్టోబరు 01
- ప్లే డర్టీ మూవీ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 01
సన్ నెక్స్ట్
- సాహసం (తమిళ మూవీ) – అక్టోబరు 01
- గౌరీ శంకర (కన్నడ సినిమా) – అక్టోబరు 01
- టేల్స్ ఆఫ్ ట్రెడిషన్ (తమిళ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
జీ5
- చెక్ మేట్ (మలయాళ సినిమా) – అక్టోబరు 02
- డాకున్ డా ముందా 3 (పంజాబీ మూవీ) – అక్టోబరు 02
జియో హాట్స్టార్
- అన్నపూరణి (మూవీ) – అక్టోబరు 01
సోనీ లివ్
- 13th (హిందీ వెబ్ సిరీస్) – అక్టోబరు 01
ఆపిల్ టీవీ ప్లస్
- ద సిస్టర్ గ్రిమ్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – అక్టోబరు 02
- లాస్ట్ బస్ (ఇంగ్లిష్ సినిమా) – అక్టోబరు 03
గమనిక: ఇవి కాకుండా వారం మధ్యలో మరికొన్ని ఓటీటీ సంస్థలు సడన్గా కొత్త సినిమాలు, సిరీస్లను స్ట్రీమింగ్కి తీసుకురావచ్చు.
