OG Movie Trailer: ‘ఓజీ’ ట్రైలర్ వచ్చేసింది..సినిమా బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే!

OG Movie Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా సినిమా ‘ఓజీ’ ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ వచ్చింది. స్టైలిష్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా సెప్టెంబర్ 25, 2025న దసరా కానుకగా విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా మూవీ ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్.

OG Movie Trailer: పవన్ అభిమానులు యూట్యూబ్, సోషల్ మీడియాలో వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఈ ట్రైలర్, ఆయన గ్యాంగ్ స్టర్ లుక్, స్టైల్, స్వాగ్ను పూర్తిగా చూపిస్తూ అంచనాలను రెట్టింప చేసింది. అలాగే ట్రైలర్‌లో తమన్ సంగీతం ఫ్యాన్స్ ను కట్టిపడేసింది.

ఇది కూడా చదవండి: Student Suicide: లేడీస్ హాస్టల్‌లో ఘోరం.. ముక్కుకి క్లిప్.. నోటికి ప్లాస్టర్‏తో యువతి ఆత్మహత్య!

సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపిస్తే, బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ ఓమీ గా విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇతర కీలక నటీనటులుగా శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, శుభలేక సుధాకర్, రావు రమేష్, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, వెంకట్ తదితరులు నటిస్తున్నారు. డీజీ టిల్లు బ్యూటీ నేహా శెట్టి స్పెషల్ సాంగ్ లో సందడి చేస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించారు.

సినిమా ప్రమోషన్లలో భాగంగా సెప్టెంబర్ 21, 2025న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ మెగా ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా తెలంగాణ సినీమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రానున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రావడం అనుమానమేనని సమాచారం. అదేవిధంగా మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఈవెంట్ లో పాల్గొననున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *