Vijay Deverakonda: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్ డమ్’ ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం తాజాగా U/A సర్టిఫికేట్‌ను పొందింది. దీంతో సినిమాను రిలీజ్ చేసేందుకు అడ్డుకులేకుండా మారింది.
పాన్ ఇండియా లెవెల్లో భారీ హైప్
Vijay Deverakonda: ‘కింగ్ డమ్’ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. విజయ్ దేవరకొండకు ఇప్పటికే భారీ ఫ్యాన్ బేస్ ఉండటంతో, ఈ సినిమా ట్రైలర్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ శనివారం (జూలై 27) రోజున చిత్ర ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Indiramma Canteens: ఇందిరమ్మ క్యాంటీన్ల లో టిఫిన్‌కి కొత్త చాప్టర్… రూ.5కే ఇడ్లీ, ఉప్మా, పూరి!
గౌతమ్ తిన్ననూరి మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా?
Vijay Deverakonda: ‘జెర్సీ’ వంటి హిట్ సినిమాతో పేరు తెచ్చుకున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, ఈ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల మన్ననలు పొందేందుకు సిద్ధమవుతున్నాడు. భావోద్వేగాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ మరియు యాక్షన్ సమ్మేళనంగా ‘కింగ్ డమ్’ కథనాన్ని తీర్చిదిద్దినట్లు సమాచారం.
విజయ్ లుక్, కథపై ఆసక్తికర చర్చ
Vijay Deverakonda: టీజర్ రిలీజ్‌తోనే విజయ్ దేవరకొండ లుక్ సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. ఆయన సీరియస్ మరియు ఇంటెన్స్ లుక్ ఈసారి కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. మునుపటి సినిమాలతో పోలిస్తే ఇది పూర్తి భిన్నమైన కథతో వస్తుందనే టాక్ వినిపిస్తోంది. రాజకీయ నేపథ్యం, సిసలైన యాక్షన్ డ్రామా వంటి అంశాలు ఇందులో ఉండబోతున్నాయని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్న టీం
ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ట్రైలర్ విడుదల అనంతరం విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించనున్నట్టు యూనిట్ వర్గాలు తెలిపాయి.
