Amit Shah: పహల్గామ్ ఉగ్రవాద దాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. పర్యాటకులపై జరిగిన దారుణ దాడికి భద్రతా దళాలు దిమ్మతిరిగే ప్రతీకారం తీర్చుకున్నాయని వెల్లడించారు. “ఆపరేషన్ సింధూర్”, “ఆపరేషన్ మహాదేవ్” పేర్లతో సాగిన కౌంటర్ ఆపరేషన్లలో మూడు మంది ఉగ్రవాదులను హతమార్చామని తెలిపారు.
దారుణమైన పహల్గామ్ దాడి – అమిత్ షా ఆవేదన
Amit Shah: పర్యాటకుల్ని మతం అడిగి చంపడం చరిత్రలోనే అత్యంత దారుణమైన చర్య అని అమిత్ షా ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబాల కళ్లముందే హత్యలు జరిగినట్లు పేర్కొన్నారు. ఈ దాడి జరిగిన వెంటనే జమ్మూకశ్మీర్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించామని చెప్పారు.
ఇది కూడా చదవండి: Operation Mahadev: అందుకే అంటారు చైనా ప్రొడక్ట్స్ వాడొద్దని..అయినా వాడారు చచ్చారు..పుర్తి కధనం!
ఉగ్రవాదుల కదలికలపై బలమైన ఇంటెలిజెన్స్
- జూలై 22న శాటిలైట్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఉగ్రవాదుల ఆచూకీ లభించింది.
- బైసరస్, లిడ్వస్ ప్రాంతాల్లో ఒకే రకమైన ఆయుధాలను వాడినట్టు గుర్తించారు.
- ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్ర శిబిరాల్ని ధ్వంసం చేసి, దాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు.
విపక్షాలపై అమిత్ షా విమర్శలు
Amit Shah: ఉగ్రవాదులను మట్టుబెట్టిన విషయంపై విపక్షాలు ఆనందపడతాయనుకున్నా, కానీ అలా జరగలేదు అని అమిత్ షా విమర్శించారు. “చెడిపోవడమే విపక్షాలకు బాధగా ఉంది. చనిపోయిన ఉగ్రవాదుల విషయంలో కూడా సంతోషించలేరు” అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రతా బలగాలకు అభినందనలు
ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించిన ఆర్మీ, CRPF, జమ్ము పోలీసులకు హోంమంత్రి అభినందనలు తెలిపారు.
అలాగే, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వ్యక్తులను కూడా అరెస్ట్ చేశామని వివరించారు.
పహల్గామ్ ఘటనపై లోక్సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశ భద్రతపై కేంద్రం దృఢంగా నిలుస్తోందని స్పష్టం చేశాయి. ఉగ్రవాదుల్ని పూర్తిగా నిర్మూలించాలన్న ఉద్దేశంతో భద్రతా దళాలు పనిచేస్తున్నాయని హోంమంత్రి హామీ ఇచ్చారు. “దేశం భద్రమైనదే, ఉగ్రవాదానికి స్థానం లేదు” అనే సందేశాన్ని పార్లమెంటులో నొక్కిచెప్పారు.
