Kingdom: ఓవర్సీస్‌లో కింగ్‌డమ్ శుభారంభం.. ప్రీమియర్ షోస్‌తోనే రికార్డ్ వసూళ్లు!

Kingdom Day 1 Collections

Kingdom: ప్రపంచవ్యాప్తంగా సినిమా అభిమానులు ఆతృతగా ఎదురుచూసిన చిత్రం కింగ్‌డమ్, చివరకు థియేటర్లలో సందడి చేస్తోంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జూలై 31న గ్రాండ్ రిలీజ్ కాగా, జూలై 30నే ఓవర్సీస్‌ ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా, విడుదలైన ప్రతీ చోటా మంచి స్పందన దక్కుతోంది.

Kingdom: గురువారం తెల్లవారుజామున నుంచే సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ రావడం సినిమాకు బాగా ప్లస్ అయింది. ఈ ఊపులో భాగంగా కింగ్‌డమ్ ఓవర్సీస్ మార్కెట్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికా ప్రీమియర్స్లో ఈ సినిమా 850,000 డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ఫిల్మ్ వర్గాలు వెల్లడించాయి. అద్భుతమైన నైట్ షో ఆక్యుపెన్సీలు, ప్రముఖ కేంద్రాల్లో హౌస్‌ఫుల్ షోలు ఈ వసూళ్లకు కారణంగా చెప్పొచ్చు.

ఇది కూడా చదవండి: Vijayawada: ప్రేమ పక్షుల్లా తిరుగుతూ రిక్కీ..తరువాత దొగ్గతనం!

Kingdom: ఓవర్సీస్‌లో మొదటి రోజే ఈ స్థాయి వసూళ్లు అందుకోవడం విజయ్ దేవరకొండ సినిమాలకు దక్కే క్రేజ్‌ను సూచిస్తోంది. ఇక వీక్ ఎండ్ కలెక్షన్లు ఎలా ఉంటాయన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మొత్తంగా చెప్పాలంటే.. ‘కింగ్‌డమ్’ ఓవర్సీస్ రన్ అట్టహాసంగా మొదలైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *