Supreme Court: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఎమ్మెల్యే ఫిరాయింపు కేసుపై సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు తీర్పు వెల్లడించనుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
Supreme Court: ఇంతకుముందు బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన రెండు వేర్వేరు పిటిషన్లను సమీకరించి, స్పీకర్ స్పందన లేకపోవడం, హైకోర్టు ఇచ్చిన తీర్పులు అమలు చేయకపోవడం వంటి అంశాలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ముఖ్యంగా దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్ల వెంకటరావు లాంటి ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నట్టు ఆరోపిస్తూ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక పిటిషన్ దాఖలు చేశారు. అలాగే మాజీ మంత్రి కేటీఆర్ కూడా పునఃవిచారణ కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్ శివారుల్లో చిరుత సంచారం.. ట్రాక్ కెమెరాకు చిక్కిన చిరుత..
Supreme Court: విచారణ సందర్భంగా, స్పీకర్ నిర్ణయానికి గడువు విధించడమా? అనే ప్రశ్నపై చర్చ సాగింది. స్పీకర్ తరపున న్యాయవాది ముకుల్ రోహిత్గి మాట్లాడుతూ, రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను కోర్టులు అణగదొక్కలేవని వాదించగా, సుప్రీంకోర్టు మాత్రం “నాలుగేళ్లు గడిచినా నిర్ణయం తీసుకోకపోతే చూడడమేనా?” అంటూ స్పందించింది. మరోవైపు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తాము బీఆర్ఎస్లోనే ఉన్నామని కోర్టుకు తెలియజేశారు.
Supreme Court: ఇప్పుడు అన్ని వాదనలు ముగిసిన అనంతరం, ఈ ఉదయం సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడించనుండటంతో.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం తేలనున్నది.
