CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజా సింగపూర్ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో, పెట్టుబడుల పరంగా, దౌత్య సంబంధాల పరంగా మైలురాయిగా నిలిచింది. గత ప్రభుత్వ పాలన కారణంగా బలహీనపడిన సంబంధాలను పునరుద్ధరించే దిశగా ఈ పర్యటన కీలకంగా మారింది. ముఖ్యంగా అమరావతి అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని మళ్లీ ప్రారంభించేందుకు చేపట్టిన చేసిన చొరవపై కేంద్రంగా ఈ పర్యటన సాగింది.
CM Chandrababu: సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, మాజీ ప్రధాని లీ సైన్ లూంగ్, వాణిజ్య శాఖ మంత్రి టాన్ సీ లెంగ్, హోం మంత్రి కె. షణ్ముగం తదితరులతో సీఎం ప్రత్యక్షంగా భేటీ అయ్యారు. సింగపూర్ ప్రతినిధులకు గతంలో చోటు చేసుకున్న లోపాలను వివరించి, కొత్త ప్రభుత్వ దృష్టికోణాన్ని, చట్టబద్ధ కార్యాచరణను వెల్లడించారు. నవంబరులో విశాఖపట్నంలో జరగనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి వారిని ఆహ్వానించారు. వారి స్పందన సానుకూలంగా ఉందని సీఎంఓ వర్గాలు తెలియజేశాయి.
ఇది కూడా చదవండి: Andhra: ఆరోజు నుండే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..
CM Chandrababu: ఈ పర్యటనలో సుర్బానా జురాంగ్, సెంబ్ కార్ప్, కేపెల్ కార్పొరేషన్, టీవీఎస్ మోటార్స్, GIC, SIA ఇంజినీరింగ్, క్యాపిటాల్యాండ్, అదానీ పోర్ట్స్ తదితర సంస్థల ప్రతినిధులతో భేటీలు జరగడం ద్వారా రాష్ట్రానికి పెట్టుబడుల అవకాశాలు విస్తరించాయి. IT, AI, ఫిన్టెక్, మారిటైమ్, హౌసింగ్, పోర్ట్ డెవలప్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలున్నట్లు వివరించారు.
CM Chandrababu: అంతేకాక, బిడదారి హౌసింగ్ ప్రాజెక్ట్, జురాంగ్ ఐలాండ్, టువాస్ పోర్ట్, స్పోర్ట్స్ స్కూల్ వంటి ప్రాజెక్టులను పరిశీలించి వాటి ఆధారంగా అత్యాధునిక మోడల్స్ను రాష్ట్రంలో ఎలా అమలు చేయాలనే దానిపై అధ్యయనం చేశారు. ముఖ్యంగా స్పోర్ట్స్ స్కూల్ తరహాలో కోచింగ్ సెంటర్లు, మౌలిక సదుపాయాలపై సీఎం ప్రత్యేకంగా ఆసక్తి చూపారు.
CM Chandrababu: ఇతర దేశాల్లోని తెలుగు డయాస్పోరా సభ్యులు సింగపూర్లో సీఎం బృందానికి ఘన స్వాగతం పలికారు. చివరి రోజు వీడ్కోలు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం గమనార్హం. సింగపూర్లో భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే ఈ పర్యటన మొత్తంలో ముఖ్యమంత్రి బృందానికి పూర్తిస్థాయిలో సహకరించారు.
మొత్తంగా చూస్తే, ఈ పర్యటన ద్వారా పెట్టుబడులకు మార్గం సుగమమైంది, మళ్లీ బలపడిన బంధాలతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ప్రపంచ వ్యాప్తంగా పునరుద్ధరించబడినట్లు స్పష్టమవుతోంది. దౌత్య పరంగా, ఆర్థిక వ్యూహంగా కూడా ఈ పర్యటన రాష్ట్రాభివృద్ధికి బలమైన బాట వేసిందని విశ్లేషకుల అభిప్రాయం.
