YS Jagan: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఉద్రిక్తతలకు దారి తీసింది. భారీ భద్రతా మధ్య ఆయన పర్యటన కొనసాగుతున్నా, ప్రజలు, పార్టీ కార్యకర్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే, భద్రతా కారణాలతో పోలీసులు కొన్ని ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నిరోధించడంతో వాగ్వాదాలు, తోపులాటలు చోటు చేసుకున్నాయి.
YS Jagan: జూలై 31 ఉదయం హెలికాప్టర్ ద్వారా నెల్లూరు చేరుకున్న జగన్ను చూడడానికి వేలాదిమంది అభిమానులు హెలిపాడ్ వద్దకు వచ్చారు. కానీ అక్కడి భద్రతా చర్యల కారణంగా పోలీసులు వారికి అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో పోలీసులూ, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. తర్వాత జగన్ కాన్వాయ్ నెల్లూరు జైలుకు వెళ్లింది. అక్కడ ఆయన తన అనుచరుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని కలిసారు. ఈ భేటీలో వైఎస్సార్సీపీ నేతలు, ఎంపీ గురుమూర్తి, కాకాణి కూతురు తదితరులు కూడా పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: చంద్రబాబు సింగపూర్ పర్యటన.. పెట్టుబడులకు నూతన దిశ!
YS Jagan: జైలు నుంచి బయటకు వచ్చిన జగన్, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లారు. అదే సమయంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనను చూడడానికి అక్కడికి చేరుకున్నారు. అయితే ఇక్కడ మరోసారి పోలీసుల తీరుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పోలీసులు రోడ్డుపై వచ్చిన జనాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్కు దిగారు. ఈ ఘటనలో కొంత మంది గాయపడ్డారు.
YS Jagan: పోలీసుల చర్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన ప్రసన్న కుమార్ రెడ్డి, రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. “ప్రజలు స్వచ్ఛందంగా జగన్ను చూడడానికి వస్తున్నారు. వారి మీద లాఠీచార్జ్ చేయడమేంటని” ప్రశ్నించారు. అంతేకాదు, “వైఎస్ జగన్ అభిమానులను ఎన్ని అడ్డంకులు పెట్టినా ఆపలేరు” అంటూ పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. జనాల్లో వైఎస్ జగన్ మీద ఉన్న ఆదరణను ఇది మరోసారి నిరూపించిందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.
