Corruption Case: అసోంలో భారీ అవినీతి కేసు వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని ACS అధికారి నూపుర్ బోరా ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించగా, రెండు బ్యాగుల నిండా నోట్ల కట్టలు, బంగారం, వజ్రాలు బయటపడ్డాయి. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది.
Corruption Case: అవినీతి ఆరోపణలతో సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్ అధికారులు ఆమె నివాసంలో శుక్రవారం సోదాలు చేశారు. తనిఖీల్లో రూ.90 లక్షల నగదు, కోటి రూపాయల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా దాదాపు రూ.2 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం నూపుర్ బోరాను అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Rajendranagar: రాజేంద్రనగర్లో మహిళ మృతదేహం కలకలం – రేప్ అండ్ మర్డర్గా అనుమానం!
2019లో అస్సాం సివిల్ సర్వీసెస్లో చేరిన నూపుర్ బోరా, ప్రస్తుతం కామ్రూప్ జిల్లా గోరోయిమారిలో సర్కిల్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అయితే గతంలో బార్పేట్ జిల్లాలో సర్కిల్ ఆఫీసర్గా పని చేసే సమయంలో డబ్బుకు బదులుగా భూమిని లంచంగా స్వీకరించినట్లు ఆరోపణలు రావడంతో, గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచారు.
సోదాల సమయంలో నూపుర్ బోరాతో పాటు లాట్ మండల్ సురాజిత్ డేకా నివాసంలో కూడా శోధనలు జరిగాయి. ఇతడిపై కూడా భూ కుంభకోణం, అవినీతి ఆరోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం ఈ కేసుపై విస్తృత దర్యాప్తు జరుగుతోంది. భూ కుంభకోణం, ఆదాయానికి మించి ఆస్తులపై పూర్తి వివరాలు వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నామని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు.
