Chemical Tanker: రోడ్డుపై ఆర్టీవో.. కంగారు పడ్డ ట్యాంకర్ డ్రైవర్.. బీభత్సమైన దృశ్యం!

Chemical Tanker:   జైపూర్-అజ్మీర్ హైవేపై ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్లతో నిండిన ట్రక్కును మంగళవారం రాత్రి 10 గంటలకు కెమికల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీనితో ట్యాంకర్ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. మంటలు సిలిండర్లకు చేరగానే అవి పేలిపోయాయి. ఒకదాని తర్వాత ఒకటిగా 200 సిలిండర్లు పేలిపోయాయి. కొన్ని 500 మీటర్ల దూరంలో ఉన్న పొలాల్లో పడిపోయాయి. పేలుళ్ల శబ్దాలు 10 కిలోమీటర్ల దూరం వరకు వినిపించాయి. దాదాపు రెండు గంటల పాటు సిలిండర్లు పేలుతూనే ఉన్నాయి.

Chemical Tanker: ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనం అయ్యారు. 12 అగ్నిమాపక యంత్రాలు మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ట్రక్కులో దాదాపు 330 సిలిండర్లు ఉన్నాయి. ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ, “ఆర్టీఓ వాహనాన్ని చూసిన ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని ధాబా వైపు తిప్పాడు. ఈ సమయంలో, అది గ్యాస్ సిలిండర్లతో నిండిన ట్రక్కును ఢీకొట్టింది.”

డూడు (జైపూర్)లోని మోఖంపుర సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పార్క్ చేసిన ఐదు వాహనాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఈ సంఘటన తర్వాత, హైవేకి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. బుధవారం తెల్లవారుజామున 4:30 గంటలకు హైవే తిరిగి ఓపెన్ చేశారు .  

బెంజీన్ తో వెళుతున్న గుజరాత్ వాహనం . .

ట్యాంకర్ బెంజీన్ తో నిండి ఉందని, ఇది అత్యంత మండే రసాయనమని మోజ్మాబాద్ తహసీల్దార్ సురేంద్ర విష్ణోయ్ తెలిపారు. పెట్రోకెమికల్ నిపుణులు దీనిని ధృవీకరించారు. రసాయనాలతో నిండిన ఈ ట్రక్కు గుజరాత్ వైపు వెళుతోంది.

ఇది కూడా చదవండి: హైవేపై కూలిపోయిన హెలికాప్టర్.. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *