India: పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ మరొక మైలురాయిని అధిగమించింది. జపాన్ను వెనక్కి నెట్టి, ప్రపంచంలో మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్ ఎదిగింది. కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
IRENA డేటా ప్రకారం భారత్ – జపాన్ comparison:
🔹 భారత్ ఉత్పత్తి చేసిన సౌరశక్తి: 1,08,494 GWh
🔹 జపాన్ ఉత్పత్తి: 96,459 GWh
ఈ గణాంకాల ప్రకారం, భారత్ ఇప్పటివరకు జపాన్ను గణనీయంగా అధిగమించింది.
మోదీ ప్రభుత్వ విధానాల ప్రభావం
India: క్లీన్ ఎనర్జీ రంగంలో భారత్ మూడో స్థానానికి చేరుకోవడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వ విధానాలు కీలకం:
India: 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర విద్యుత్ లక్ష్యం
బహుముఖ ఇంధన విధానాలు నేషనల్ సోలార్ మిషన్, PM-KUSUM వంటి పథకాల విజయవంతమైన అమలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో సోలార్ విద్యుత్ ప్రోత్సాహం
ప్రపంచంలో దారితీస్తున్న దేశాలు – 2024 డేటా ప్రకారం:
1. చైనా – దాదాపు 260 GW సామర్థ్యంతో ప్రపంచంలో నెంబర్ 1 (2023లోనే మూడు రెట్లు వృద్ధి)
2. అమెరికా – స్థిరమైన వృద్ధి కొనసాగిస్తూ 2వ స్థానం
3. భారత్ – ఇప్పుడు మూడవ స్థానంలో జపాన్ను దాటి, పునరుత్పాదక శక్తిలో కీలక ఆటగాడిగా
India: భారత్ సాధించిన ఈ విజయం కేవలం గణాంకాలలోనే కాక, పరిశుభ్రమైన వాతావరణం, ఇంధన భద్రత వంటి కీలక అంశాలపైనా ప్రభావం చూపనుంది. దేశవ్యాప్తంగా సౌరశక్తి విస్తరణను చూస్తే, త్వరలోనే భారత్ చైనా, అమెరికాల సరసన నిలబడి ప్రపంచ క్లైమేట్ అజెండాలో తన ఆధిపత్యాన్ని చూపే అవకాశం ఉంది.
వెలుగు దిశగా భారత్ ప్రయాణం.. మరింత శక్తివంతంగా కొనసాగుతోంది!