Indigo Flight: ముంబై నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ విషాదకర సంఘటన చోటు చేసుకుంది. ఒక ప్రయాణికుడు పానిక్ అటాక్‌తో బాధపడుతూ సహాయం కోరుతున్న సమయంలో, మరొక ప్రయాణికుడు అతని చెంపపై కొట్టిన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ దాడి ఘటన విమాన ప్రయాణ భద్రతపై పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది.
Indigo Flight: విమానంలో జరిగిన ఈ ఘటనలో పానిక్ అటాక్‌తో బాధపడుతున్న ప్రయాణికుడు సహాయం కోసం అటూ ఇటూ నడుస్తూ, గందరగోళంగా ప్రవర్తించాడు. అతని పరిస్థితిని గమనించిన ఎయిర్ హోస్టెస్‌లు సానుభూతితో స్పందించి అతడిని ఓదార్చేందుకు ప్రయత్నించారు. కానీ వెనుక సీటులో కూర్చున్న మరొక ప్రయాణికుడు ఒక్కసారిగా లేచి, బాధితుడిపై చెంపదెబ్బ కొట్టాడు.
ఇది కూడా చదవండి: Delhi Railway Stampede: ప్రాణాలు తీసిన బ్యాగ్.. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటకు అసలు కారణం!
Indigo Flight: ఈ ఘటనను ఇతర ప్రయాణికులు వీడియోలో రికార్డు చేయగా, ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. దాడి చేసిన వ్యక్తిని అక్కడే ఉన్న ప్రయాణికులు నిలదీశారు. అతని నిర్లక్ష్య సమాధానం ఇతరుల ఆగ్రహానికి దారితీసింది. ఎయిర్ హోస్టెస్‌లు కూడా అతన్ని ప్రశ్నిస్తూ శాంత పరచే ప్రయత్నం చేశారు.
Indigo Flight: ఇండిగో ఎయిర్‌లైన్స్ ఈ ఘటనపై అధికారికంగా స్పందించింది. వారు విడుదల చేసిన ప్రకటనలో, ఇలా దుర్వినియోగంగా ప్రవర్తించే ప్రయాణికులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విమానం కోల్‌కతాలో ల్యాండ్ అయిన తర్వాత, దాడికి పాల్పడిన ప్రయాణికుడిని భద్రతా అధికారులకు అప్పగించినట్టు వెల్లడించారు. అతన్ని “అన్‌రూలీ ప్యాసింజర్”గా గుర్తించినట్టు వెల్లడించారు.
A passenger had a panic attack on a trip, and an unrelated passenger intervenes by slapping him. Do not judge individuals based on their colour, race, or religion, as this incites hostility and becomes a hate crime. pic.twitter.com/td8BO7e44T
— Haam Waheed (@haam76) August 1, 2025
Indigo Flight: ఇక నెటిజన్లు ఈ ఘటనపై తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పానిక్ అటాక్ వచ్చిన వ్యక్తిని ఆదుకోవాల్సింది పోయి చెంపదెబ్బ కొట్టడం అమానవీయ చర్యగా పేర్కొంటున్నారు. ఇది మానవత్వానికి మచ్చ అంటించే ఘటనగా అభివర్ణిస్తున్నారు.
ఇండిగో ఎయిర్‌లైన్స్ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. ప్రయాణికుల భద్రత, గౌరవం సంస్థకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది.
