Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలు.. కమిషన్ తేల్చేసిన బాధ్యులు ఎవరు!

Kaleshwaram Project

Kaleshwaram Project: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్ఠాత్మకమైన కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నివేదికపై రాష్ట్ర కేబినెట్ సోమవారం సమావేశమై కీలక చర్చ జరపనుంది.

నివేదికలో ఏముంది..?

Kaleshwaram Project: ప్రాజెక్ట్ రూపకల్పన నుంచి నిర్మాణం, నిర్వహణ వరకు జరిగిన ప్రమాదకర లోపాలు, ప్రజాధన దుర్వినియోగం, బాధ్యత వహించాల్సిన అధికారుల పేర్లను కమిషన్ తన 700 పేజీల నివేదికలో స్పష్టంగా పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామేజ్‌కి బాధ్యులెవరో తేల్చిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: MP Sudha Ramakrishnan: మార్నింగ్ వాక్ చేస్తుండగా ఎంపీ మెడలో గొలుసు లాకెళ్లిన దొంగలు!

ఖర్చుల విషయంలో అసమతుల్యతలు

Kaleshwaram Project: ప్రాథమికంగా ప్రణాళిక చేసిన ప్రాణహిత-చెవెళ్ల ప్రాజెక్ట్ ఖర్చు రూ. 38,500 కోట్లు కాగా, కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు మొదట అంచనా రూ. 71,436 కోట్లు. కానీ 2022 మార్చికల్లా ఈ మొత్తం రూ. 1.10 లక్షల కోట్లు దాటిందని నివేదిక పేర్కొంది. 2016లో ముఖ్యమంత్రి ఇచ్చిన లేఖను ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ ఖర్చుల పెరుగుదలపై వివరాలను వెల్లడించింది.

మేడిగడ్డ సర్టిఫికెట్ల వివాదం

Kaleshwaram Project: నిర్మాణం పూర్తికాకముందే మేడిగడ్డ ప్రాజెక్టు ఏజెన్సీకి రెండు సర్టిఫికెట్లు ఇవ్వడం పూర్తిగా తప్పిదమని, ఇది చట్టవిరుద్ధమని కమిషన్ తేల్చేసింది. 2019 సెప్టెంబర్ 9న ‘కన్స్ట్రక్షన్ కంప్లీషన్’ సర్టిఫికెట్, 2021 మార్చి 15న ‘వర్క్ కంప్లీషన్’ సర్టిఫికెట్ ఇవ్వడం తప్పని పేర్కొంది.

తెరపైకి వచ్చే చర్యలు..?

Kaleshwaram Project: ఇప్పటికే రాజకీయ వాతావరణంలో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల్లో, కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదే హాట్ టాపిక్. కమిషన్ నివేదిక ఆధారంగా శిక్షలు, విచారణలు ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

ఈ నివేదికతో తెలంగాణ పాలనలో పారదర్శకత, ప్రభుత్వ పాలన విధానాలపై ప్రజలు, మీడియా, రాజకీయవర్గాలు ప్రశ్నలు వేస్తున్నాయి. ఇకపై తీసుకునే చర్యలే ప్రాజెక్టుపై ప్రజల నమ్మకాన్ని తిరిగి తెచ్చే మార్గం కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *