Cheapest Prepaid Plans: సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటున్నారా? ఈ చౌక ప్లాన్స్ వాడేయండి!

Cheapest Prepaid Plans: ఇప్పుడు చాలా మంది రెండు సిమ్ కార్డులు వాడుతున్నారు. కానీ రెండో సిమ్ ఎక్కువగా ఉపయోగం లేకపోయినా, దాన్ని యాక్టివ్‌గా ఉంచుకోవడం కోసం రీఛార్జ్ తప్పనిసరి అవుతుంది. అలాంటప్పుడు పెద్దగా ఖర్చు కాకుండా చీపెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ను ఎంచుకోవడం బెస్ట్ ఆప్షన్. ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా (Vi)లో ప్రస్తుతం ఉన్న చౌక ప్లాన్స్ వివరాలు చూద్దాం.

జియో ప్లాన్స్

  • ₹448 ప్లాన్ → 84 రోజుల వ్యాలిడిటీ. అన్‌లిమిటెడ్ కాలింగ్, 1,000 SMSలు. (డేటా లేదు) → సెకండరీ సిమ్‌కు పర్ఫెక్ట్.

  • ₹1748 ప్లాన్ → 336 రోజుల వ్యాలిడిటీ. అన్‌లిమిటెడ్ కాలింగ్ మాత్రమే.

ఇది కూడా చదవండి: Haryana: మహిళలకు ప్రతినెలా రూ.2100..! ఈ నెల 25 నుంచి లడ్లీ లక్ష్మీ యోజన ప్రారంభం!

ఎయిర్‌టెల్ ప్లాన్స్

  • ₹469 ప్లాన్ → 84 రోజుల వ్యాలిడిటీ. అన్‌లిమిటెడ్ కాలింగ్, 900 SMSలు.

  • ₹1849 ప్లాన్ → 365 రోజుల వ్యాలిడిటీ. అన్‌లిమిటెడ్ కాలింగ్ మాత్రమే, డేటా లేదు.

Vi (Vodafone Idea) ప్లాన్స్

  • ₹470 ప్లాన్ → 84 రోజుల వ్యాలిడిటీ. అన్‌లిమిటెడ్ కాలింగ్, 900 SMSలు.

  • ₹1189 ప్లాన్ → 365 రోజుల వ్యాలిడిటీ. 50GB డేటా మాత్రమే, అన్‌లిమిటెడ్ కాలింగ్ లేదు.

  • ₹1849 ప్లాన్ → 365 రోజుల వ్యాలిడిటీ. అన్‌లిమిటెడ్ కాలింగ్, (డేటా లేదు).

ఈ చౌక ప్లాన్స్‌తో రెండో సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవచ్చు. ఇన్‌కమింగ్, అవుట్‌గోయింగ్ కాల్స్, SMS, ప్రాథమిక అవసరాలు తీరుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *