Nara Lokesh: పరకామణి ఘటనపై సిట్‌ విచారణకు ఆదేశిస్తాం.. నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: తిరుమల పరకామణి ఘటనపై చంద్రబాబు ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించనుంది. ఈ వ్యవహారంపై సిట్‌ విచారణ జరిపిస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వ కాలంలో జరిగిన ఈ సంఘటనలో నిజాలు బయటపడేలా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Nara Lokesh: మంత్రి మాట్లాడుతూ, పరకామణి చోరీ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయకుండా కేవలం నోటీసులు ఇచ్చి వదిలేశారని ఆరోపించారు. దేవుడి దగ్గర కూడా నాటకాలు ఆడారని, అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ అండ్ టీమ్ దేవుడి దగ్గర దొంగచాటుగా వ్యవహరించారని, అందుకే ఇప్పుడు నిజం వెలుగులోకి వస్తోందని లోకేష్ అన్నారు.

ఇది కూడా చదవండి: Cheapest Prepaid Plans: సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకుంటున్నారా? ఈ చౌక ప్లాన్స్ వాడేయండి!

2023 ఏప్రిల్‌లో పెద్ద జీయర్ మఠం క్లర్క్ రవికుమార్ పరకామణిలో డబ్బు దొంగిలిస్తుండగా పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 900 అమెరికన్ డాలర్లు స్వాధీనం చేయగా, అధికారులు అతనిపై కఠిన చర్యలు తీసుకోకుండా లోక్‌ అదాలత్‌లో రాజీ చేశారు. రవికుమార్ గతంలో కూడా పరకామణి నుంచి కోట్ల రూపాయల విలువైన దొంగతనాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంపై హైకోర్టు సైతం స్పందించింది. పరకామణి వ్యవహారంపై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఒక నెలలోపు దర్యాప్తు పూర్తి చేసి సీల్డ్ కవర్‌లో నివేదిక అందించాలని సూచించింది.

ఒకవైపు హైకోర్టు ఆదేశాలతో సీఐడీ విచారణ కొనసాగుతుండగా, మరోవైపు లోకేష్ సిట్‌ విచారణను ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ కేసులో ఇంకా ఎలాంటి నిజాలు బయటపడతాయన్న ఆసక్తి పెరుగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *