Simhachalam: శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా సింహాచలం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానంలో సోమవారం భక్తి శ్రద్ధలతో ఆయుధపూజ నిర్వహించారు. మూలా నక్షత్రం సందర్భాన్ని పురస్కరించుకుని, సింహవల్లీ తాయార్ ఆలయం వద్ద వీరలక్ష్మీ ఆయుధపూజ ఆరాధనను సంప్రదాయబద్ధంగా జరిపారు.
Simhachalam: ఈ సందర్భంగా అప్పన్నకు ఉత్సవాల సమయంలో అలంకరించే కత్తి, ఖడ్గం, కైజారు, గద, శరం, విల్లంబు, సుదర్శన చక్రం వంటి ఆయుధాలకు షోడశోపచారాలు సమర్పించారు. ఆలయ స్థానాచార్యులు రాజగోపాల్ పర్యవేక్షణలో, పురోహితులు కరి సీతారామాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల తరపున ఫలాలను నివేదించారు.
ఇది కూడా చదవండి: Deadly Hornets: నరసాపురం తీర గ్రామాల్లో విషపుటీగల హడావిడి.. ప్రాణాలకు ముప్పు
మూడు రోజులపాటు ఉభయసంధ్యలలో ఆయుధపూజను కొనసాగిస్తారని ఆలయ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, అనేక మంది భక్తులు పాల్గొన్నారు. స్వామివారి ఆయుధాలను ప్రత్యక్షంగా దర్శించిన భక్తులు ఆ క్షణాన్ని అదృష్టంగా భావించారు.
