Viral Video: జంతువులతో సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఎప్పుడూ ఆకర్షిస్తుంటాయి. వాటిలో క్యూట్ కుక్కపిల్లలు, ఏనుగు పిల్లల వీడియోలు అయితే వైరల్ కావడం కామన్. ప్రస్తుతం ఓ చిన్న గున్న ఏనుగుతో జరిగిన చిలిపి సంఘటన వీడియోగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు నవ్వుతూ పడిపోతున్నారు.
Viral Video: ఈ వీడియోలో అడవి నుంచి బయటకు వస్తున్న ఒక గున్న ఏనుగు కనిపిస్తుంది. అది చిన్న పిల్లాడిలా తనదైన దారిలో సాగుతోంది. ఆ సమయంలో రోడ్డుపై ఉన్న ఓ పొద, ఏనుగు కాలు చుట్టేసింది. దాంతో అది ముందుకు నడవలేకపోయింది. ఏనుగు మొదట ఒళ్లు వంచి తన తొండంతో ఆ పొదను తొలగించబోయింది. తర్వాత తన పాదాలతో తొక్కి పారేయాలనుకుంది.
ఇది కూడా చదవండి: Viral Video: మొండితనంతో ప్రమాదాలు కొనితెచ్చుకోకండి.. వర్షాకాలంలో జాగ్రత్తలు తప్పనిసరి!
Viral Video: అయితే ఆ పొద చివరికి ఏనుగు దంతాల్లో ఇరుక్కుపోయింది. దీంతో ఏనుగుకి మరింత కోపం వచ్చి, ఆ పొదనే టార్గెట్ చేసింది. దానిని రోడ్డుపైకి లాగి వచ్చి.. తొక్కి, తన్ని, తొండంతో దానికి గుణపాఠం నేర్పించింది. ముచ్చటగా తను ఓ యుద్ధం చేసి గెలిచినట్లు ఫీల్ అవుతూ అతి గర్వంగా ముందుకి నడిచింది.
Viral Video: ఈ వీడియో చూసిన నెటిజన్లు “చిన్న ఏనుగు కోపం కూడా చాలా క్యూట్గా ఉంది”, “ఈ చిలిపి వీడియో మళ్లీ మళ్లీ చూస్తున్నాం”, “ఏనుగులకి మనుషులకంటే ఎక్కువ నాటకీయత ఉంటుంది” అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఈ ఫన్నీ క్లిప్ను aanakazhchakalum_viseshangalum అనే ఇన్స్టా యూజర్ షేర్ చేశారు. ఇప్పటికే 50వేలకుపైగా లైక్స్, వేలాది షేర్స్ వచ్చాయి. మీరు కూడా ఒకసారి ఈ వీడియో చూస్తే – నవ్వకుండా ఉండలేరు!
View this post on Instagram
