Pilot Suspended: తన కుటుంబాన్ని సర్ప్రైజ్ చేయాలనే ఉద్దేశంతో ఒక బ్రిటీష్ ఎయిర్వేస్ పైలెట్ పెద్ద తప్పిదం చేసి చిక్కుల్లో పడ్డాడు. విమానం నడుపుతున్న సమయంలో కాక్‌పిట్ డోర్ మూసివేయకుండా వదిలి పెట్టడంతో, అతనిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. చివరికి ఎయిర్‌లైన్స్ యాజమాన్యం అతడిని సస్పెండ్ చేసింది.
Pilot Suspended: వివరాల్లోకి వెళితే.. లండన్ హీత్రూ ఎయిర్‌పోర్టు నుంచి న్యూయార్క్ వెళ్తున్న బ్రిటీష్ ఎయిర్వేస్ విమానాన్ని ఒక పైలెట్ నడుపుతున్నాడు. అదే విమానంలో అతని కుటుంబ సభ్యులు ప్రయాణిస్తుండగా, తాను ఎలా విమానాన్ని నడుపుతానో చూపించాలన్న ఉద్దేశంతో కాక్‌పిట్ డోర్‌ను తెరిచి ఉంచాడు.
అయితే, ప్రయాణికులు మరియు సిబ్బంది ఈ దృశ్యాన్ని గమనించి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానం న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక వారు అధికారులకు ఫిర్యాదు చేశారు. పైలెట్ కాక్‌పిట్ డోర్‌ను తెరిచి ఉంచి విమానం నడిపినట్లు వివరించారు.
గతంలో, 2011 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల తర్వాత విమానయాన భద్రతా నిబంధనల్లో కీలక మార్పులు చేశారు. అందులో భాగంగానే ప్రయాణ సమయంలో కాక్‌పిట్ డోర్‌ను మూసివేయడం తప్పనిసరి చేశారు. ఈ నిబంధనను ఉల్లంఘించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు.
ఈ నేపథ్యంలోనే పైలెట్ చేసిన చర్యను కఠినంగా పరిగణించిన బ్రిటీష్ ఎయిర్వేస్ యాజమాన్యం, అతడిని సస్పెండ్ చేసింది. భద్రత విషయంలో జోక్యం సహించబోమని స్పష్టంగా తెలిపింది.
