Illegal Surrogacy: సరోగసీ కేసులో కొత్త మలుపు.. 10వ తరగతి చదివిన మహిళ నడిపిన ఇల్లీగల్‌ సెంటర్‌

Illegal Surrogacy: హైదరాబాద్ మేడ్చల్‌ జిల్లాలో వెలుగులోకి వచ్చిన సరోగసీ కేసు సంచలనం రేపుతోంది. 10వ తరగతి మాత్రమే చదివిన లక్ష్మీ అనే మహిళ, పదిసార్లు స్వయంగా ఎగ్‌ డోనేషన్‌ చేసి, రెండు సార్లు సరోగేట్‌ మదర్‌గా మారిన తర్వాత, ఈ దందాను “కుటీర పరిశ్రమ”లా నడిపినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది.

Illegal Surrogacy: నిందితురాలు లక్ష్మిపై BNS 318(4), 61(2) యాక్ట్‌ కింద రెండు కేసులు, ART యాక్ట్‌ కింద రెండు కేసులు, సరోగసీ యాక్ట్‌ కింద నాలుగు కేసులు నమోదు చేశారు. ఆగస్టు 14న పక్కా సమాచారంతో పోలీసులు మేడ్చల్‌లోని ఓ ఇంటిపై దాడి చేసి, అక్కడ సరోగసీ జరుగుతున్నట్లు గుర్తించారు. సరోగేట్ తల్లులతో పాటు పలు ఫెర్టిలిటీ హాస్పిటల్స్‌కు చెందిన డాక్యుమెంట్స్‌ కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad: మాదాపూర్‌లో అక్రమ సరోగసీ రాకెట్‌ భయంకర నిజాలు..!

మొదట్లో లక్ష్మీ ఎగ్‌ డోనర్‌గా, తర్వాత సరోగేట్‌ మదర్‌గా వ్యవహరించింది. కానీ పెద్ద ఎత్తున డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో “LLH Fertility Services Pvt Ltd” పేరిట కంపెనీ ప్రారంభించింది. పలు ఫెర్టిలిటీ సెంటర్లతో కాంటాక్ట్స్‌ ఉపయోగించుకుని, ఎగ్‌ డోనర్లు, సరోగేట్ మదర్స్‌ను సరఫరా చేసింది. ఈ క్రమంలో, జంటల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తూ, ఫెర్టిలిటీ సెంటర్ల దగ్గర నుంచి కమిషన్‌ కూడా తీసుకునేదని FIRలో పోలీసులు పేర్కొన్నారు.

ముంబైలోనూ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కేసు
ముంబైలో హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కేసు నమోదైన తర్వాత లక్ష్మీ తన కంపెనీని మూసేసి, వ్యక్తిగత కాంటాక్ట్స్‌తో రహస్యంగా ఈ దందాను కొనసాగించింది. 1994లో వివాహం చేసుకున్న ఆమె భర్తతో వ్యక్తిగత కారణాలతో వేరుగా ఉంటూ, కొడుకు, కూతురితో కలసి ఈ ఇల్లీగల్‌ బిజినెస్‌ను నడిపినట్లు పోలీసులు చెబుతున్నారు.

కమీషన్‌ రేట్లు, సెంటర్లపై నోటీసులు
ఎగ్‌ డోనర్‌ ఒక్కొక్కరికి రూ.40 వేల కమీషన్‌ ఇవ్వగా, సరోగేట్ మదర్స్‌కు రూ.60 వేల కమీషన్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 50 మందికి పైగా సరోగసీ చేయించినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్‌, అను టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌, ఫెర్టీ కేర్‌, EVA IVF, అమూల్య IVF, శ్రీ ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు జారీ చేశారు.

మరిన్ని అరెస్టుల సూచన
ప్రస్తుతం లక్ష్మితోపాటు ఆమె కొడుకును పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం (ఆగస్టు 18) మేడ్చల్‌ కోర్టులో కస్టడీ పిటీషన్‌ దాఖలు చేయనున్నారు. ఐదు రోజులపాటు కస్టడీ కోరే అవకాశం ఉంది. ఈ విచారణలో మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *