Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం టాప్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్‌గా మారిన బన్నీ, ఇప్పుడు వరుసగా భారీ ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప అంచనాలను మించి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడమే కాకుండా, నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నారు.
Allu Arjun: పుష్ప 2 కూడా ఏకంగా ₹1000 కోట్లకు పైగా వసూలు చేసి, ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పుడు అట్లీతో చేస్తున్న ప్రాజెక్ట్ పాన్ ఇండియా స్థాయిలోనే కాకుండా, హాలీవుడ్ రేంజ్లో ఉండబోతుందన్న టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల విడుదలైన ఓ ప్రమోషనల్ వీడియోలో, అల్లు అర్జున్ – అట్లీ జోడీ హాలీవుడ్ మేకర్స్, వీఎఫ్ఎక్స్ టీమ్స్‌తో సమావేశమవడం చూపించారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై మరింత అంచనాలు పెరిగాయి.
ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ పోషించనున్నారని సమాచారం. అతనికి జోడిగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా, మరికొందరు హీరోయిన్లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించబోతున్నారని ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే బాహుబలి వంటి బ్లాక్‌బస్టర్‌లో గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ, మాస్ ఇమేజ్ ఉన్న బన్నీ సినిమాలో కనిపించడం థియేటర్స్‌లో హంగామా చేయడమే కాకుండా, కథకు కూడా బలం చేకూర్చే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక త్వరలోనే మేకర్స్ రమ్యకృష్ణ పాత్రపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
