Viral: నదిలో స్కూబా డైవింగ్ చేస్తుండగా మహిళకు కనిపించిన 100 ఏళ్ల నాటి సీసా

Viral: అమెరికాలోని మిషిగన్ రాష్ట్రంలో ఒక మహిళ సాధారణంగా చేసిన స్కూబా డైవ్, అద్భుతమైన అనుభూతిగా మారింది. చెబోయ్‌గన్‌ నదిలో డైవ్ చేసిన జెనిఫర్‌ డౌకర్‌ అనే స్కూబా డైవర్‌కి దాదాపు వందేళ్ల నాటి సీసా దొరికింది. ఆ సీసాలో ఒక చీటీ కూడా ఉండటంతో ఆమె ఆశ్చర్యపోయింది.

Viral: 1926లో రాసిన ఆ లేఖలో, “ఈ బాటిల్ ఎవరికైనా దొరికితే, చెబోయగన్‌లోని జార్జ్ మోరోకు తిరిగి ఇవ్వండి. ఎక్కడ దొరికిందో కూడా చెప్పండి” అని రాసి ఉంది. లేఖ అంత కాలం నీటిలో ఉన్నప్పటికీ స్పష్టంగా చదవగలిగేలా ఉండటం చూసి జెనిఫర్ ఆశ్చర్యపోయింది.

ఈ విషయం ఫేస్‌బుక్‌లో షేర్ చేయగానే అది క్షణాల్లో వైరల్ అయింది. లక్షలాది మంది ఆ పోస్ట్‌ను షేర్ చేశారు. కొద్ది రోజుల్లోనే జార్జ్ మోరో కూతురు మిచెల్ ప్రిమో, జెనిఫర్‌తో సంప్రదించింది. లేఖ తన తండ్రి హ్యాండ్‌రైటింగ్ అని వెంటనే గుర్తుపట్టింది. తాను పుట్టకముందే రాసినా, అది తమ కుటుంబానికి ఒక విలువైన జ్ఞాపకం అని చెప్పింది.

Viral

జెనిఫర్ ఆ లేఖను మిచెల్‌కి ఇవ్వాలని అనుకుంది. అయితే, మిచెల్ మాత్రం దాన్ని జెనిఫర్ వద్దే ఉంచుకోవాలని సూచించింది. అందరికీ గుర్తుండేలా తన బోటులో ప్రదర్శనగా పెట్టమని కోరింది. ప్రస్తుతం ఆ బాటిల్, లేఖను జెనిఫర్ ఫ్రేమ్ చేసి ఆఫీస్‌లో అమర్చింది.

ఇలా ఒక సాధారణ డైవ్, 100 ఏళ్ల నాటి కథను వెలుగులోకి తెచ్చింది. ఒక చిన్న సందేశం కూడా ఎంతటి అనుబంధాన్ని కలిగించగలదో ఈ సంఘటన మరోసారి నిరూపించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *