Wife Attacks: దెయ్యం పట్టిందంటూ భర్తపై దాడి చేసిన భార్య!

Wife Attacks: ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలం వీ.ఎం.బంజర్ పంచాయతీ జంగాల కాలనీలో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య చేతిలో భర్తకు తీవ్ర గాయాలు కావడంతో గ్రామంలో ఉద్రిక్తత చెలరేగింది.

Wife Attacks: జంగాల కాలనీలో నివసిస్తున్న గంగారాం (51), లక్ష్మి దంపతులు గత 35 ఏళ్లుగా అక్కడే ఉంటున్నారు. గంగారాం మద్యానికి బానిస కావడంతో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం పరిస్థితి తీవ్రరూపం దాల్చింది.

భార్య లక్ష్మి అకస్మాత్తుగా తనకు దెయ్యం పట్టిందంటూ వింతగా ప్రవర్తించింది. కేకలు వేస్తూ భర్త గంగారాం నిద్రపోతున్న సమయంలో దాడి చేసింది. అతని నోటిలో గుడ్డలు కుక్కి, కర్రతో విచక్షణ లేకుండా కొట్టింది. ఈ దాడిలో గంగారాం తీవ్రంగా గాయపడి బయటకు పరుగులు పెట్టాడు.

తర్వాత బంధువులు గంగారాంను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఎందుకు ఇలా చేసావని ప్రశ్నించగా లక్ష్మి మళ్లీ “దెయ్యం పట్టింది” అంటూ విచిత్రంగా స్పందించింది.

తర్వాత గంగారాం స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్య తనను కావాలనే చిత్రహింసలకు గురి చేసిందని, నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు విరిచి ఇనుపరాడ్‌తో దాడి చేసిందని ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు లక్ష్మిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం గంగారాం పరిస్థితి విషమించడంతో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతనికి పక్కటెముకలు విరిగినట్టు వైద్యులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *