BCCI: ఆసియా కప్ ముందు బీసీసీఐకి కేంద్ర చట్టాలతో పెద్ద షాక్!

BCCI: ఆసియా కప్ 2025కు ముందు బీసీసీఐకి ఊహించని దెబ్బ తగిలింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ లా – 2025 ఇంకా ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్ – 2025 వల్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నష్టాన్ని ఎదుర్కొనవలసి రావచ్చు. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీలతో ఉన్న స్పాన్సర్‌షిప్ ఒప్పందాలను రద్దు చేసుకోవాల్సి వస్తే, దాదాపు రూ.400 కోట్ల వరకు ఆదాయం కోల్పోవాల్సి వస్తుందని అంచనా.

BCCI: లోక్‌సభ ఆమోదం పొందిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్ 2025 ప్రకారం రియల్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు, వాటి ప్రమోటర్లు నిషేధంకి లోబడతారు. దీనివల్ల ప్రస్తుతం డ్రీమ్11 టీమిండియాకు ప్రధాన స్పాన్సర్‌గా ఉండగా, మై11సర్కిల్ ఐపీఎల్ ఫాంటసీ హక్కులను మూడు సంవత్సరాలకు పొందింది. కొత్త చట్టం అమల్లోకి రాగానే ఈ ఒప్పందాలు రద్దు కావాల్సి ఉంటుంది.

ఈ పరిస్థితిపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ –“దేశంలో అమల్లో ఉన్న చట్టాలను మేము పూర్తిగా గౌరవిస్తాం. ఒకవేళ ఈ సంస్థలు చట్టానికి విరుద్ధంగా ఉంటే వాటి నుంచి స్పాన్సర్‌షిప్ తీసుకోలేం. మద్యం, సిగరెట్ బ్రాండ్స్‌ను నిషేధించినప్పుడు కూడా మేము వాటి నుంచి ఎలాంటి డీల్ చేయలేదు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీసీసీఐ ఒక్క అడుగు కూడా వేయదు” అని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Sebi: అవధూత్ సాథే ఎవరు? 400 కోట్ల అక్రమ లాభాల కేసుతో సెబీ దాడులు

నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ లా – 2025 ప్రకారం, భారత్ పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని, కానీ అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో మాత్రం తలపడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధానం ప్రకారం టీమిండియా యూఏఈలో జరిగే ఆసియా కప్ 2025లో సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడనుంది. అయితే ద్వైపాక్షిక పర్యటనలు ఇకముందు జరగవు.

కశ్మీర్‌లో ఉగ్రదాడులు, అనంతరం మే నెలలో భారత్-పాక్ సరిహద్దులో జరిగిన సైనిక ఘర్షణల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రజల నుంచి విమర్శలు వచ్చినా, భారత్-పాక్ ద్వైపాక్షిక సంబంధాలు నిలిచిపోతాయని, కానీ అంతర్జాతీయ క్రీడల్లో మాత్రం పోటీలు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

బీసీసీఐకి ఈ కొత్త చట్టాలు ఆర్థికంగా పెద్ద షాక్ ఇచ్చే అవకాశం ఉంది. ఆసియా కప్, రాబోయే సిరీస్‌లు, ఐపీఎల్‌లో కూడా స్పాన్సర్‌షిప్ వ్యవహారాలు మారవచ్చు. అయితే కార్యదర్శి దేవజిత్ సైకియా చెప్పినట్లుగా – “ప్రభుత్వం చెప్పిందే తుది మాట. ఆటగాళ్లు, జట్ల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని కేంద్ర నిర్ణయాలకు బీసీసీఐ 100% కట్టుబడి ఉంటుంది.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *