Tollywood: సినీరంగంలో నటీనటులుగా గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభం కాదు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్లుగా ఎదిగిన తర్వాత ఆ స్టార్డమ్ను నిలబెట్టుకోవడం పెద్ద సవాలే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ సైతం, కెరీర్ ఫాంలో ఉండగానే చెప్పిన ఒక్క అబద్ధం కారణంగా సినిమాలకు దూరమయ్యేలా చేసింది.
Tollywood: ఒకప్పుడు అగ్రకథానాయికగా వెలుగొందిన ఆమె వరుస సినిమాలతో టాప్ హీరోయిన్గా దూసుకుపోయింది. కానీ కెరీర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే బాత్రూం గోడల్లో వందల కోట్లు దొరకడం, వాటిపై ఆమె చెప్పిన ఒక అబద్ధం చివరకు కెరీర్ నాశనమయ్యేలా చేసింది. ఆమె పేరు మాలా సిన్హా. అసలు పేరు ఆల్డా సిన్హా. 1936 నవంబర్ 11న బెంగాలీ నేపాలీ కుటుంబంలో జన్మించింది. 1954లో బాద్ షా సినిమాతో సినీరంగంలో అడుగుపెట్టింది.
తన కెరీర్లో దాదాపు 120 సినిమాల్లో నటించింది. బాలీవుడ్లోని స్టార్ హీరోలు ధర్మేంద్ర, గురు దత్, అశోక్ కుమార్, దిలీప్ కుమార్లతో కలిసి నటించింది. హిందీలో ప్యాసా, ధూల్ కా ఫూల్, హరియాలీ ఔర్ రాస్తా, అన్పఢ్, గుమ్రా వంటి చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. 1958 నుంచి 1965 వరకు అగ్ర కథానాయికగా దూసుకుపోయింది.
అయితే నటిగా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం మాలా సిన్హా అనేక సవాళ్లు ఎదుర్కొంది. డబ్బు విషయంలో ఆమె ఎంతో జాగ్రత్తగా ఉండేదని అప్పట్లో టాక్. కెరీర్ పీక్లో ఉన్న సమయంలోనే ఆమె ఇంటిపై ఆదాయపు పన్ను అధికారులు దాడి చేశారు. ఆ దాడిలో బాత్రూం గోడల్లో కట్టల కొద్దీ డబ్బు దొరికింది. అప్పట్లో దాని విలువ సుమారు రూ.100 కోట్లు.
ఆ డబ్బు చట్టబద్ధమైనదని నిరూపించాల్సి వచ్చింది. కానీ తన తండ్రి, లాయర్ సలహాపై కోర్టులో ఆ డబ్బు వేశ్యావృత్తితో సంపాదించిందని అబద్ధం చెప్పింది. ఆ ఒక్క మాటే ఆమె కెరీర్ను కూల్చేసింది. అభిమానులు, నిర్మాతలు ఆమెను దూరం పెట్టారు. దీంతో సినిమాల్లో అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి.
1966లో నేపాలీ నటుడు చిదంబర్ ప్రసాద్ లోహానీని మాలా సిన్హా వివాహం చేసుకుంది. వారికి ప్రతిభా సిన్హా అనే కూతురు ఉంది. 2024లో ఆమె భర్త మరణించారు. ప్రస్తుతం ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటోంది మాలా సిన్హా.
