Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అవ్వడానికి రెడీ అవుతోంది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన సమంత, టాలీవుడ్లో దాదాపు ప్రతి స్టార్ హీరోతోనూ జోడీ కట్టింది. సమంత అందానికి, నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు లేడని చెప్పొచ్చు. తెలుగు సినిమాలతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ సమంత తన నటనతో మెప్పించింది.
Samantha: ఇటీవలే నిర్మాతగా మారిన సమంత, శుభం సినిమాతో మంచి విజయాన్ని సాధించింది. ఒకానొక సమయంలో తెలుగు ఇండస్ట్రీలో హీరోయిన్గా ఏలిన సమంత, గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది. మాయోసైటిస్ వ్యాధితో బాధపడిన ఆమె, ఏడాది పాటు విశ్రాంతి తీసుకుంది. ఇప్పుడు తిరిగి సినిమాలతో బిజీ అవ్వడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా, దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నారా? అనే రూమర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య ఇద్దరూ కలిసున్న ఫొటోలు కూడా తెగ చక్కర్లు కొడుతున్నాయి.
మాయోసైటిస్ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న సమంత, ఇప్పుడు బాగుపడుతున్నా కూడా సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన నిర్ణయం వెనుక కారణాలను వెల్లడించింది.
“గతంతో పోలిస్తే ఇప్పుడు నాలో చాలా మార్పులు వచ్చాయి. ఒకేసారి ఐదు సినిమాలు చేయను. తక్కువ సినిమాలు చేసినా అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉండాలి. నేను మానసికంగా, శారీరకంగా హెల్దీగా ఉండాలని నిర్ణయించుకున్నా. నా శరీరం చెప్పేది వినాలని అనుకుంటున్నా. సినిమాలు లేదా సిరీస్లు పేరు కోసం కాదు.. నాకు దగ్గరైన కథలు ఉంటేనే చేస్తా,” అని సమంత చెప్పింది.
ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు సమంత తక్కువ సినిమాలు చేస్తుందన్న వార్తతో నిరాశ వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఆమె ఆరోగ్యం, క్వాలిటీ ప్రాజెక్ట్స్ పైన దృష్టి పెట్టడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
View this post on Instagram
