Flipkart Big Billion days: షాపింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. వచ్చేస్తోంది భారీ సేల్

Flipkart Big Billion days: ప్రముఖ ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు ఈ పండుగ సీజన్‌కి భారీ సేల్స్‌కి రంగం సిద్ధం చేస్తున్నాయి. ఆన్‌లైన్‌ షాపింగ్‌కు అలవాటు పడినవారికి ఇది గోల్డెన్‌ ఛాన్స్‌ అని చెప్పొచ్చు. ముఖ్యంగా Flipkart Big Billion Days 2025 ఇంకా Amazon Great Indian Festival 2025 కోసం షాపింగ్ లవర్స్‌ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ 2025 తేదీలు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2025 సెప్టెంబర్ 15 నుండి సెప్టెంబర్ 30 వరకు జరుగనుందని సమాచారం. ఈ వివరాలు ఫ్లిప్‌కార్ట్ అధికారిక ప్రోడక్ట్ పేజీలలో కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ఒక రోజు ముందుగానే సేల్‌లో యాక్సెస్ లభిస్తుంది.

అద్భుతమైన డిస్కౌంట్లు

ఈ సేల్‌లో మొబైల్స్‌, స్మార్ట్‌ఫోన్లు, ఐఫోన్ మోడల్స్‌, స్మార్ట్‌ టీవీలు, వాషింగ్‌ మెషీన్స్‌, ఫ్రిజ్‌లు, ఎలక్ట్రానిక్స్‌పై భారీ తగ్గింపులు అందుబాటులో ఉంటాయని అంచనా. రూ.1కి స్పెషల్‌ డీల్‌ లాంటి ఆఫర్లు కూడా ఉండనున్నాయి.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025

ఫ్లిప్‌కార్ట్‌తో పాటు అమెజాన్ కూడా తమ భారీ సేల్‌కి సిద్ధమవుతోంది. Amazon Great Indian Festival 2025 ఈసారి సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభమై అక్టోబర్ మధ్యలో ముగిసే అవకాశం ఉంది. ఈ సేల్‌లో కూడా ప్రైమ్ సభ్యులకు ముందుగా యాక్సెస్ లభిస్తుంది.

ఈ సేల్‌లో ప్రత్యేకతలు

  • ఐఫోన్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు

  • స్మార్ట్‌ టీవీలు, వాషింగ్‌ మెషీన్స్‌, ఫ్రిజ్‌లపై బంపర్ ఆఫర్లు

  • ఎలక్ట్రిక్ గాడ్జెట్లపై అదిరే తగ్గింపులు

  • ప్రైమ్ & ప్లస్ సభ్యులకు ముందుగానే యాక్సెస్

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ మరియు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ ఈసారి మరింత హాట్‌గానే ఉండనున్నాయి. పండుగ సీజన్‌లో షాపింగ్ చేసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ టైమ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *