America Tariffs: అమెరికా అదనపు సుంకాల మోత – భారత్‌కు 50% పన్నుల షాక్

America Tariffs: అమెరికా విధించిన 50 శాతం అదనపు సుంకాలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ నిర్ణయం భారత వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రష్యా నుండి ముడి చమురు దిగుమతి, వాణిజ్య అసమతుల్యత వంటి కారణాలతోనే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రకటించింది.

భారత్ అభ్యంతరం – “అన్యాయం, అసమంజసం”

America Tariffs: ఈ సుంకాలను భారత్ తీవ్రంగా ఖండించింది. కేంద్ర ప్రభుత్వం వీటిని “అన్యాయం, అసమంజసమైనవి” అని పేర్కొంటూ, రైతులు, చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కాపాడటానికి కట్టుబడి ఉందని స్పష్టం చేసింది.

ట్రంప్ పరిపాలనలోనే మొదలైన ఒత్తిడి

మొదటగా ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై 25% సుంకం విధించగా, తరువాత మరో 25% సుంకం వేసింది. దీంతో మొత్తం 50 శాతం వరకు సుంకాల భారాన్ని భారత్ భరించాల్సి వస్తోంది. ఈ ప్రభావం ప్రధానంగా వ్యవసాయ, చిన్న వ్యాపార రంగాలపై పడనుందని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.

మోదీ ప్రతిస్పందన – “ప్రజల ప్రయోజనాల కోసం పోరాటం”

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ – “భారత్‌పై ఒత్తిడి పెరగవచ్చు. కానీ రైతులు, చిన్న వ్యాపారులు, జాతీయ ప్రయోజనాలను కాపాడటంలో మా ప్రభుత్వం వెనక్కి తగ్గదు. ప్రతి సవాల్‌ను ఎదుర్కొంటుంది” అని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *