Asia Cup 2025: నేను ముస్లిం కాబట్టి.. పాక్ మ్యాచ్‌పై షమీ షాకింగ్ కామెంట్స్!

Asia Cup 2025: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ ఆసియా కప్‌ 2025లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై తన అభిప్రాయం వెల్లడించాడు. ప్రభుత్వం, బీసీసీఐ తీసుకునే నిర్ణయాన్నే అనుసరిస్తానని, పాక్‌తో ఆడటంలో తప్పులేదని ఆయన పేర్కొన్నాడు. అభిమానుల క్రేజ్ కారణంగా పాకిస్థాన్ మ్యాచ్ భిన్నంగా ఉంటుందని కూడా చెప్పాడు.

Asia Cup 2025: “పాక్‌తో మ్యాచ్‌ ఆడాలా వద్దా అన్నది మేం నిర్ణయించం. ప్రభుత్వం, బీసీసీఐ ఏమి చెబుతాయో మేం అనుసరిస్తాం. అభిమానుల ఉత్సాహం వల్ల పాక్‌తో మ్యాచ్ ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది” అని షమీ తెలిపారు.

అలాగే సోషల్ మీడియాలో తాను ఎదుర్కొంటున్న ట్రోలింగ్ గురించి కూడా ఆయన స్పందించాడు. “నేను ముస్లింని కాబట్టి పాకిస్తాన్ మ్యాచ్‌ల తర్వాత కొందరు నన్ను లక్ష్యంగా చేసుకుంటారు. ట్రోల్ చేస్తారు. కానీ నాకు అది పట్టదు. నేను యంత్రం కాదు. నాకు కూడా మంచి, చెడు రోజులు ఉంటాయి. నేను నా దేశం కోసం ఆడుతున్నప్పుడు, ట్రోల్స్ గురించి ఆలోచించను. నా దృష్టి వికెట్లు తీయడంపైనే ఉంటుంది” అని షమీ వ్యాఖ్యానించాడు.

కాగా, ఆసియా కప్‌ 2025 కోసం ఎంపిక చేసిన జట్టులో షమీకి స్థానం దక్కలేదు. ఐపీఎల్‌ 2025లో ఆయన ప్రదర్శన ఫ్లాప్ అవ్వడంతో సెలెక్టర్లు అతన్ని టీ20 జట్టులో పరిగణలోకి తీసుకోలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *