Pawan Kalyan Birthday: గీతా ఆర్ట్స్ నుంచి పవన్ కు స్పెషల్ విషెస్.. అదిరింది..చుస్తే గూస్ బంప్స్ పక్కా

Pawan Kalyan Birthday: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 54వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, రాజకీయ నేతలు, సినీ ప్రముఖుల శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన రీల్స్‌, వీడియోలు, ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఈ వేడుకలో గీతా ఆర్ట్స్ విడుదల చేసిన ప్రత్యేక వీడియో ఫ్యాన్స్‌కు మరింత హర్షం కలిగిస్తోంది.

Pawan Kalyan Birthday: పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణం నుంచి రాజకీయ రంగం వరకు అన్నింటినీ చూపిస్తూ గీతా ఆర్ట్స్ రూపొందించిన ఈ బర్త్‌డే స్పెషల్ మాష్‌అప్ హృదయాలను కదిలిస్తోంది. పవన్ సినిమాల్లోని ఎమోషనల్ డైలాగులు, యాక్షన్ సన్నివేశాలు, ఆయన స్పీచ్‌లు, సినీ ప్రముఖులు చెప్పిన విశేషాలు—all in oneగా పొందుపరిచారు. ముఖ్యంగా బండ్ల గణేష్ పలికిన “ఈశ్వరా.. పవనేశ్వరా..” అనే డైలాగ్‌తో ఈ వీడియో మొదలై, చివరి వరకు అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది.

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగంలో అడుగుపెట్టిన పవన్, తనదైన నటనతో, మేనరిజంతో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. అభిమానులను మాత్రమే కాకుండా, భక్తులను సొంతం చేసుకున్న అరుదైన నటుడిగా నిలిచారు. సినిమాల్లో పీక్ స్టేజ్‌లో ఉన్నప్పటికీ ప్రజలకు ఏదో చేయాలన్న తపనతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జనసేన పార్టీని స్థాపించి, నేడు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తున్నారు.

గీతా ఆర్ట్స్ రూపొందించిన ఈ మాష్‌అప్ వీడియో పవన్ కళ్యాణ్ సినీ, రాజకీయ జర్నీని ఒకే చోట చూపిస్తూ ఆయన ప్రత్యేకతను గుర్తు చేస్తోంది. పవన్ పుట్టినరోజు వేడుకలకు ఇది మరింత రంగులద్దినట్టయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *