Viral Video: ఓడిపోయినా ఆటపై వ్యామోహం.. వర్షంలో నాలుగు గంటలు కూర్చున్న ఆటగాడు!

Viral Video: ఉత్తర చైనా నుంచి వచ్చిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జియాంగ్కీ (చైనీస్ చెస్) ఆటలో ఓడిపోయిన ఓ వ్యక్తి చెస్ బోర్డును వదిలి వెళ్లకుండా వర్షంలోనే నాలుగు గంటల పాటు కూర్చున్నాడు. భారీ వర్షం కురుస్తున్నా తన ఓటమిని అంగీకరించకుండా, ఎక్కడ తప్పు చేశానో ఆలోచిస్తూ అతను కదలకుండా కూర్చోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Viral Video: ఆ వ్యక్తి భార్య అతన్ని లోపలికి రమ్మని ఎన్నిసార్లు అభ్యర్థించినా, అతను మొండిగా బయటే కూర్చున్నాడు. ఈ సంఘటన చెస్ పట్ల అతని మోజును స్పష్టంగా చూపించింది.

ఈ వీడియో అమెరికన్ గ్రాండ్‌మాస్టర్ హాన్స్ నీమాన్ సహా ప్రపంచవ్యాప్తంగా అనేక మంది చెస్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. హాన్స్ తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ, “2019లో ముంబైలో జరిగిన U16 ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్‌లో ఆడుతున్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ వల్ల వరుసగా మూడు ఆటలు ఓడిపోయాను. అప్పుడు నేను కూడా పూల్ దగ్గర వర్షంలోనే గంటల తరబడి కూర్చున్నాను” అని X (Twitter)లో పోస్ట్ చేశారు.

నెట్టింట్లో ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకరు “మీరు ఇష్టపడే దాంట్లో పూర్తిగా మునిగిపోతే ప్రపంచాన్ని మర్చిపోతారు” అని కామెంట్ చేస్తే, మరొకరు “ద్రోణాచార్యుడు అర్జునుడిని కేవలం మామిడిపైనే దృష్టి పెట్టమన్న సందర్భం గుర్తుకు వచ్చింది” అని రాశారు.

ఈ వీడియో ప్రస్తుతం లక్షలాది వ్యూస్ సాధించి, చెస్ పట్ల ఉన్న మక్కువ ఎంత గాఢమైందో నిరూపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *