Couple Missing: గద్వాల్ జిల్లా మల్దకల్ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లిన దంపతులు గల్లంతవ్వడంతో గ్రామంలో కలకలం రేగింది. రాత్రి ఇంటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు చెరువు దగ్గరికి వెళ్లి చూసి షాక్కు గురయ్యారు.
Couple Missing: వివరాల ప్రకారం.. తాటికుంట గ్రామానికి చెందిన రాముడు, సంధ్య దంపతులు నిన్న సాయంత్రం చేపల వేటకు వెళ్లారు. అయితే రాత్రి అయ్యినా వారు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు వెతకసాగారు. ఈ క్రమంలో చెరువు వద్దకు వెళ్లి చూసే సరికి వారు వాడిన పడవ (పుట్టి) బోల్తా పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Bigg Boss9 Telugu: బిగ్ బాస్ వచ్చేస్తోంది.. మరి హౌస్ లోకి వెళ్ళేవారెవరో తెలుసా? ఇదిగో లిస్ట్..
సమాచారం అందుకున్న మల్దకల్ పోలీసులు, SDRF సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి గల్లంతైన భార్యాభర్తల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికీ వారి ఆచూకీ దొరకలేదని అధికారులు తెలిపారు.
ఈ ఘటనతో తాటికుంట గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. స్థానికులు కూడా కుటుంబ సభ్యులతో కలిసి చెరువు వద్ద గుమికూడి రాముడు, సంధ్య క్షేమంగా దొరకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
