Sonakshi Sinha: సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉంటుందో.. అంతే నష్టం కూడా ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రెటీల లైఫ్‌లో సోషల్ మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా అభిమానులను ఆకట్టుకునే హీరోయిన్స్ కొన్నిసార్లు ట్రోల్స్‌కి, వివాదాలకు గురవుతుంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పలు వెబ్‌సైట్స్‌కి లీగల్ నోటీసులు పంపించి హాట్ టాపిక్‌గా మారింది.
Sonakshi Sinha: సోనాక్షి సిన్హా తాజాగా కొన్ని ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తన అనుమతి లేకుండా ఫోటోలను వాడుకున్నారని ఆరోపిస్తూ లీగల్ నోటీసులు పంపింది. తక్షణమే ఫోటోలను తొలగించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.
సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన దబాంగ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సోనాక్షి, వరుసగా హిట్స్ అందుకుంది. రజనీకాంత్‌తో కలిసి లింగ సినిమాతో సౌత్ ప్రేక్షకులను కూడా అలరించింది. ఇటీవల జహీర్ ఇక్బాల్‌తో పెళ్లి చేసుకున్న సోనాక్షి, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న జటాధరా చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది.
సోనాక్షి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, “నేను పలు బ్రాండ్ల డ్రస్సులు, జ్యువెలరీలు ప్రమోట్ చేస్తుంటాను. ఆ ఫోటోలను అనుమతి లేకుండా వాడుకోవడం చట్టపరంగా తప్పు. వెంటనే తొలగించండి. లేకపోతే సహించను” అని స్పష్టం చేసింది.
View this post on Instagram
ప్రస్తుతం సోనాక్షి సిన్హా పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు ఆమెకు మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
