Headmaster: బెంచ్‌పై పడుకొని స్టూడెంట్స్‌తో కాళ్లు పట్టించుకున్న హెడ్‌మాస్టర్‌!

Headmaster: పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన గురువులు కొన్నిసార్లు విద్యార్థులపై తప్పు ప్రవర్తన ప్రదర్శిస్తున్న సంఘటనలు వెలుగుచూస్తుంటాయి. తాజాగా తమిళనాడులో చోటుచేసుకున్న ఒక ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ తీవ్ర ఆగ్రహానికి కారణమవుతోంది.

Headmaster: ధర్మపురి జిల్లా హరూర్‌లోని మావేరిపట్టి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు కలైవాణి విద్యార్థులతో తగినంత శ్రద్ధ చూపాల్సింది పోయి, తరగతి గదిలోని బెంచ్‌పై పడుకొని వారితో కాళ్లు నొక్కించుకున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

సిబ్బందిలో కొందరు ఈ దృశ్యాలను తమ మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియో క్షణాల్లో వైరల్ అయింది. దీన్ని చూసిన తల్లిదండ్రులు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పిల్లలను ఇకపై ఆ పాఠశాలకు పంపించబోమని తల్లిదండ్రులు నిరసన తెలిపారు.

ఈ ఘటనపై జిల్లా విద్యా శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. ప్రాథమిక విద్యాధికారి విజయకుమార్‌, వట్టదాక్షియర్ పెరుమాళ్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ సత్యప్రియను సంఘటనా స్థలానికి పంపి, నిజానిజాలు బయటపెట్టే విచారణ జరపాలని ఆదేశించారు. విచారణ అనంతరం ఆధారాల ప్రకారం ప్రధానోపాధ్యాయురాలిపై తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

ప్రస్తుతం ఈ వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఉపాధ్యాయురాలి ప్రవర్తనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *