Virat Kohli: క్రికెట్‌కు దూరమైనా ప్రాక్టీస్ ఆపలేదు..అందుకే క్రికెట్ ప్రపంచంలో కింగ్!

Virat Kohli

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా అనేక ఊహాగానాలు వస్తున్నాయి. 36 ఏళ్ల కోహ్లీ త్వరలోనే రిటైర్ అవుతాడేమోనని క్రికెట్ అభిమానుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టెస్ట్ క్రికెట్‌లో శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో భారత్ సాధించిన విజయాల తర్వాత, 2027 ప్రపంచ కప్ నాటికి యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించాలనే ఆలోచన జట్టులో ఉందని కొన్ని నివేదికలు సూచించాయి.

Virat Kohli: అయితే, ఈ చర్చలపై కోహ్లీ ఎలాంటి స్పందన ఇవ్వకపోయినా, తన క్రమశిక్షణను మాత్రం కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న కోహ్లీ, తన తదుపరి మ్యాచ్‌కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ, ప్రాక్టీస్ నెట్స్‌లో బిజీగా కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానితో కలిసి తీసుకున్న సెల్ఫీలో కూడా కోహ్లీ ట్రైనింగ్ డ్రెస్‌లో, ప్రాక్టీస్ మోడ్‌లో ఉన్నాడు.

ఇది కూడా చదవండి: Crime News: షాకింగ్ ఘటన ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య స్కెచ్

ఈ ఫోటో బయటపడటంతో అభిమానులు ఆనందంతో మునిగిపోయారు. “2027 వరల్డ్ కప్‌కి ఖచ్చితంగా వస్తాడు” అంటూ ఒకరు ట్వీట్ చేయగా, మరో అభిమాని “మా మ్యాన్ బతికే ఉన్నాడు, ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు” అని కామెంట్ చేశాడు. ఇంకొకరు “అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఉంది.. కోహ్లీ దుమ్మురేపబోతున్నాడు” అంటూ పోస్ట్ చేశారు.

గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ ఫోటో బయటపడిన రోజు కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన 17 ఏళ్లు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం అతను వన్డే ఫార్మాట్‌కే పరిమితమయ్యాడు. అయితే, మరో కొన్ని ఏళ్లు ఆడితే, వన్డేల్లో సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే 14,000 పరుగులు పూర్తి చేసిన కోహ్లీ, సచిన్ రికార్డుకు కేవలం 4,000 పరుగుల దూరంలో ఉన్నాడు.

ఇక IPL 2025లో కోహ్లీ తన కెరీర్‌కు కొత్త మెరుగులు దిద్దాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత మొదటిసారి టైటిల్ గెలిపించాడు. ఈ విజయంతో కోహ్లీ క్రికెట్‌లో తన కట్టుబాటు, కష్టపడే తత్వాన్ని మరోసారి రుజువు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *