Viral Video: బాహుబలి ఎద్దు.. ఒక్క దెబ్బతో కారును ఎత్తిపడేసింది!

Viral Video: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. ముఖ్యంగా జంతువుల వీడియోలను అందరూ ఆసక్తిగా చూస్తారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో ఒక ఎద్దు కారును అమాంతం ఎత్తిపడేసింది. ఆ దృశ్యం చూసిన వారంతా అవాక్కయ్యారు. వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Viral Video: ఎద్దు బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతటి బరువునైనా ఎత్తిపడేసే శక్తి ఎద్దుకే ఉంటుంది. తాజాగా మెక్సికోలోని గ్వాడలజారాలో జరిగిన ఘటనలో ఒక ఎద్దు తన బలాన్ని చూపింది. రోడ్డుపక్కన పార్క్ చేసిన కారుపై ఎద్దు దాడి చేసి దానిని గాల్లోకి ఎత్తిపడేసింది. ఈ సంఘటనను చూసిన జనాలు షాక్ అయ్యారు.

ఇది కూడా చదవండి: APPSC Jobs 2025: ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల –దరఖాస్తు చేసే అవకాశం!

వైరల్ వీడియోలో ఎద్దు కారును ఒక బొమ్మను ఎత్తినంత సులభంగా ముందుకు తోసింది. ఆ తర్వాత గోడకు ఢీకొట్టింది. దీంతో కారు తీవ్రమైన నష్టం చవిచూసింది. కానీ ఎద్దు కోపం ఇంతటితో ఆగలేదు. కారుపై కొమ్ములతో దాడి చేసింది. దీంతో కారు మొత్తం డ్యామేజీ అయిపోయింది. సుమారు 1 నిమిషం 40 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు వింతగా స్పందిస్తున్నారు. ఒక యూజర్.. “అమ్మో! ఎద్దు బలం చూసి షాక్ అయ్యాను” అని రాశాడు. మరో యూజర్.. “కారును కాగితంలా ఎత్తిపడేసింది” అని కామెంట్ పెట్టాడు. అయితే ఎద్దు శరీరం నుండి రక్తం కారుతున్నట్లు కనిపించడంతో కొందరు దానిపై సానుభూతి వ్యక్తం చేశారు. మొత్తానికి ఈ వీడియోలో ఎద్దు శక్తిని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

Raging bull wrecks someone’s parked Car.
byu/H1gh_Tr3ason ininterestingasfuck

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *