ChatGPT: ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ సేవల్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీని కారణంగా భారత్‌తో పాటు అనేక దేశాల్లో ఉన్న లక్షలాది మంది వినియోగదారులు ప్రస్తుతం ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయలేకపోతున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదుల వెల్లువ వెల్లువెత్తుతోంది.
ChatGPT: డౌన్‌డిటెక్టర్ వివరాల ప్రకారం, బుధవారం మధ్యాహ్నం నుంచి ఈ సమస్యలు ప్రారంభమయ్యాయి. కేవలం భారత్ నుంచే దాదాపు 500కుపైగా ఫిర్యాదులు నమోదైనట్లు సమాచారం. యూజర్లు మొబైల్ యాప్, కంప్యూటర్ రెండింటిలోనూ ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. కొందరికి స్క్రీన్ అసలు ఓపెన్ కాకపోవడం, కొందరికి ఎర్రర్ మెసేజ్‌లు రావడం, మరికొందరికి బాట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి.
అంతేకాకుండా, లాగిన్ సమస్యలు, నెట్వర్క్ ఎర్రర్స్ వంటి ఇబ్బందులు కూడా యూజర్లను ఇరకాటంలోకి నెట్టాయి. ఈ కారణంగా “ChatGPT Down” హ్యాష్‌ట్యాగ్‌తో ఎక్స్ (ట్విట్టర్)లో యూజర్లు పెద్దఎత్తున పోస్టులు పెడుతూ ట్రెండ్‌లోకి తెచ్చారు.
అయితే, ఈ సేవా అంతరాయం పై ఓపెన్ఏఐ సంస్థ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. సమస్య ఏ కారణం వల్ల తలెత్తిందో, ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియరాలేదు.
