AI ChatGPT: కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా పనిచేసే చాట్బాట్లు నేడు మన జీవితంలో ఒక ప్రధాన భాగంగా మారాయి. వాటిలో ముఖ్యంగా చాట్‌జీపీటీ లాంటి జనరేటివ్ ఏఐ సాధనాలు వేగంగా సమాచారం అందించడం, రాత పనులు చేయడం, సలహాలు ఇవ్వడం వంటి విధుల్లో ఎంతో ఉపయోగకరంగా నిలుస్తున్నాయి. అయితే, వీటి వినియోగంలో జాగ్రత్తలు పాటించకపోతే తీవ్రమైన చట్టపరమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
AI ChatGPT: ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు చాట్బాట్ల వినియోగంపై కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. సమాజ శ్రేయస్సు దృష్ట్యా, చట్టవిరుద్ధమైన లేదా ప్రమాదకరమైన సమాచారాన్ని అడిగేవారిపై చర్యలు తీసుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బాంబులు, పేలుడు పదార్థాల తయారీ విధానాలు, ఆత్మహత్య మార్గాలు, హింసాత్మక ప్రణాళికలు, మైనర్లపై దాడులు వంటి అంశాలపై ప్రశ్నలు అడిగితే, వాటిని నేరపూరితంగా పరిగణించి శిక్షించవచ్చు.
అలాగే, ఏఐ చాట్బాట్ల వినియోగం వల్ల వ్యక్తిగత డేటా భద్రతపైనా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాలు, సైబర్ సెక్యూరిటీ సంస్థలు ఈ సంభాషణలపై నిఘా ఉంచే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
ఇక ఏఐ ప్రభావం మరోవైపు ఉద్యోగ మార్కెట్‌ను కూడా తాకుతోంది. ప్రోగ్రామింగ్, రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ లాంటి రంగాల్లో మానవ శ్రమకు బదులు ఏఐ సాధనాలను వాడుతున్నారు. దీని వల్ల అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందువల్ల, చాట్‌జీపీటీ వంటి ఏఐ సాధనాలను ఉపయోగించే ప్రతి ఒక్కరూ వాటి పరిమితులను గుర్తించి, చట్టబద్ధమైన ప్రశ్నలకే పరిమితం కావాలి. కేవలం సరదాగా లేదా ఆసక్తిగా అడిగిన తప్పు ప్రశ్న కూడా జైలుకు దారి తీసే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.
