Mega DSC 2025: మెగా డీఎస్సీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ వాయిదా..! కారణం ఇదే

Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించిన మెగా డీఎస్సీ–2025 నియామక ప్రక్రియలో సర్టిఫికెట్ల పరిశీలన (Verification) వాయిదా పడింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ తాజాగా ఈ విషయం వెల్లడించింది.

Mega DSC 2025: ఇటీవల విడుదలైన మెరిట్‌ జాబితా ఆధారంగా రిజర్వేషన్లు, స్థానికత ప్రకారం కటాఫ్‌ మార్కులు నిర్ణయించి, ర్యాంకులు కేటాయించారు. ఎంపికైన అభ్యర్థులకు 1:1 విధానంలో కాల్‌ లెటర్లు ఇవ్వాలని అధికారులు ముందుగా నిర్ణయించారు. ఆగస్టు 24న కాల్‌ లెటర్లు పంపి, ఆగస్టు 25 నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ ప్రారంభించాలని షెడ్యూల్‌ ప్రకటించినప్పటికీ, సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రక్రియ వాయిదా పడింది.

విద్యాశాఖ సమాచారం ప్రకారం, ఆగస్టు 25 ఉదయం నుంచి అభ్యర్థుల లాగిన్‌లో కాల్‌లెటర్లు ఉంచుతారు. తర్వాత ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి, కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ అంతా సెప్టెంబరు మొదటి వారంలోగా ముగించాలని అధికారులు యోచిస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు రెండో వారంలో పాఠశాలల్లో హాజరు కావడానికి తగిన విధంగా షెడ్యూల్‌ను సవరించారు.

డీఎస్సీలో కొందరు అభ్యర్థులు ఒకేసారి రెండు–మూడు పోస్టులకు అర్హత సాధించినట్లు తెలుస్తోంది. వీరిలో ప్రతి ఒక్కరికి దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఐచ్ఛికాల ప్రకారమే పోస్టు కేటాయిస్తారు. అంటే మొదటి ప్రాధాన్యం ఇచ్చిన పోస్టు వారికి లభిస్తుంది. మిగతా పోస్టులు తరువాతి ర్యాంకర్లకు కేటాయిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *