Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతదేశం రష్యా నుండి చమురు దిగుమతులను కొనసాగించడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చైనా తర్వాత రష్యా చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న దేశం భారత్ అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌పై మరిన్ని ఆర్థిక ఆంక్షలు, అదనపు సుంకాలు విధించే అవకాశం ఉందని ట్రంప్ హెచ్చరించారు.
Donald Trump: ట్రంప్ వ్యాఖ్యానిస్తూ, రష్యాతో వాణిజ్య సంబంధాలను కొనసాగించే దేశాలపై అమెరికా ఇంకా ఫేజ్-2, ఫేజ్-3 ఆంక్షలను అమలు చేయలేదని తెలిపారు. అయితే, భారతదేశంపై ద్వితీయ ఆంక్షలు విధించడం అనేది రష్యాపై ప్రత్యక్ష చర్య తీసుకున్నట్టే అవుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఏడాది జనవరిలో ఓవల్ ఆఫీస్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రష్యాపై ఎందుకు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదని విలేకరులు ప్రశ్నించగా, ట్రంప్ ఈ విధంగా స్పందించారు. అమెరికా తాత్కాలికంగా చైనాపై అదనపు సుంకాలను నిలిపివేసినా, భారతదేశంపై మాత్రం భారీ సుంకాలు విధించింది.
ఇది కూడా చదవండి: Putin Warning: భారత్-చైనా ఆర్థిక సూపర్ పవర్.. అణగదొక్కాలని చూస్తే..ట్రంప్‌కు పుతిన్ వార్నింగ్!
ఇప్పటికే భారత్‌పై 25 శాతం సుంకం విధించగా, ఆగస్టు 27 నుంచి రెండో దశలో మరో 25 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. దీంతో భారతీయ వస్తువులపై మొత్తం సుంకం 50 శాతం వరకు పెరిగింది.
“భారత్ రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తోంది. ఇది రష్యాకు వందల బిలియన్ డాలర్ల లాభాన్ని తెస్తోంది. దానిని మీరు చర్య కాదని ఎలా చెబుతారు? ఫేజ్-2, ఫేజ్-3 ఆంక్షలు ఇంకా మిగిలే ఉన్నాయి” అని ట్రంప్ పోలాండ్ అధ్యక్షుడితో కలిసి వైట్ హౌస్‌లో జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలతో భారత్-అమెరికా వాణిజ్య సంబంధాలు కొత్త దిశలోకి వెళ్ళే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
