JNTU Hyderabad: జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTU-H) విద్యార్థులకు సంబంధించిన ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలల్లో ఫార్మా-డి మొదటి సంవత్సరం పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని జేఎన్టీయూ పరీక్షల విభాగం డైరెక్టర్ డాక్టర్ కె.కృష్ణమోహన్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు.
JNTU Hyderabad: మొదట సెప్టెంబర్ 6న జరగాల్సిన ఈ పరీక్షలు, అదే రోజు గణేశ్ నిమజ్జనం ఉండటంతో వాయిదా వేయబడ్డాయి. విద్యార్థుల సౌకర్యం దృష్ట్యా, ఈ పరీక్షలు ఇప్పుడు సెప్టెంబర్ 17, 2025న నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో షాక్..యువతి వద్ద 3.1 కిలోల గంజాయి పట్టుబాటు
విద్యార్థులు ఈ మార్పును గమనించి, పరీక్షలకు తగిన విధంగా సిద్ధం కావాలని యూనివర్సిటీ సూచించింది. అలాగే వాయిదా వేసిన పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను జేఎన్టీయూ అధికారిక వెబ్సైట్ jntuh.ac.inలో చూడవచ్చని తెలిపారు.
ఇక మరోవైపు, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) హిందీ ట్రాన్స్‌లేటర్ పరీక్ష 2025 ప్రాథమిక ఆన్సర్ కీను విడుదల చేసింది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ఆన్సర్ కీతో పాటు ప్రశ్నపత్రం, రెస్పాన్స్ షీట్‌ను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఆన్సర్ కీపై అభ్యంతరాలను నమోదు చేసుకోవడానికి సెప్టెంబర్ 7, 2025 వరకు అవకాశం కల్పించారు. కాగా, ఈ పరీక్ష ఆగస్టు 12న నిర్వహించబడిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కింద వివిధ ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.
