Ganesh Laddu Auction: తెలుగు రాష్ట్రాల్లో గణేశుడు అంటే ఖైరతాబాద్ గణనాధుడు, లడ్డూ అంటే బాలాపూర్ గణేష్ లడ్డూ గుర్తుకు వస్తాయి. బాలాపూర్ లడ్డూ వేలం దశాబ్దాల చరిత్ర కలిగి ఉంది. కానీ గత కొన్నేళ్లుగా హైదరాబాద్లోని ఇతర ప్రాంతాల్లో కూడా గణేష్ లడ్డూ వేలంపాటలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తాజాగా రాజేంద్రనగర్లో జరిగిన ఒక లడ్డూ వేలం పాట చరిత్ర సృష్టించింది.
Ganesh Laddu Auction: హైదరాబాద్ రాజేంద్రనగర్ సన్ సిటీలోని రిచ్మండ్ విల్లాస్ వద్ద గణపతి లడ్డూ వేలంలో రికార్డు నమోదైంది. ఈసారి లడ్డూ ఏకంగా రూ.2.32 కోట్లకు అమ్ముడుపోయింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్వహించిన ఈ వేలంపాటలో శుక్రవారం స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ వేలం పాటను రూ.1 కోటి వద్ద ప్రారంభించారు. గత ఏడాది ఇదే కమ్యూనిటీలో లడ్డూ రూ.1.87 కోట్లకు అమ్ముడుపోయింది. అయితే ఈసారి గత రికార్డును తిరగరాస్తూ రూ.2.32 కోట్లకు చేరుకుంది. ప్రతి ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ వేలంలో స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.
Richmond Villas Laddu auction. This year 2025 Rs 2.3174 crore. Proud to be part of this community 🙏🙏🙏 pic.twitter.com/fPrmUdryoc
— Shailesh Reddy Speaks (@shaileshreddi) September 5, 2025
హైదరాబాద్లో గణపతి ఉత్సవాలకు మరింత అందాన్ని చేర్చిన ఈ వేలం పాట, గణేష్ భక్తుల విశ్వాసం, భక్తిశ్రద్ధలను ప్రతిబింబించింది. “లడ్డూ అన్నది కేవలం ప్రసాదం కాదు, అదృష్టానికి ప్రతీక” అనే భావనతోనే భక్తులు ఇంత భారీ మొత్తాలను వెచ్చిస్తున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.
